అన్వేషించండి

Shaakuntalam movie: ఆ సినిమాలకు పోటీగా ‘శాకుంతలం’ - రిలీజ్ డేట్ వచ్చేసింది

సమంత తాజా మూవీ ‘శాకుంతలం’ విడుదలకు రెడీ అయ్యింది. గుణ శేఖర్ దర్శకత్వంతో తెరకెక్కి ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 3Dలోనూ ఈ సినిమా విడుదలకానుంది.

‘యశోద’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సమంత, మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఆమె నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘శాకుంతలం’ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. గుణశేఖర్ తెరకెక్కించిన ఎపిక్ లవ్ స్టోరీ విడుదల తేదీ వెల్లడైంది. ఫిబ్రవరి 17, 2023  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించారు.  

ప్రపంచ వ్యాప్తంగా 2D, 3D వెర్షన్ లలో విడుదల

వాస్తవానికి ఈ సినిమాను 2020లో అనౌన్స్ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా పలు మార్లు వాయిదా పడింది. షూటింగ్ సైతం చాలా కాలం కిందటే పూర్తయ్యింది. అయినా, 3D వెర్షన్ తో పాటు రకరకాల కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే, తాజాగా సమంత నటించిన ‘యశోద’ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇదే ఊపులో ‘శాకుంతలం’ సినిమాను విడుదల చేస్తే మంచి సక్సెస్ అందుకోవచ్చని మేకర్స్ భావిస్తున్నారు. అందులో భాగంగానే కొత్త సంవత్సరం వేళ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు.  ఈమేరకు గుణ టీమ్ వర్క్స్ ట్విట్టర్ వేదికగా సినిమా విడుదల తేదీని వెల్లడించింది. “ఫిబ్రవరి 17, 2023న ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎపిక్ లవ్ స్టోరీని మీకు సమీపంలోని థియేటర్లలో చూడండి. 3D వెర్షన్‌ సైతం అందుబాటులో ఉంది” అని ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో సమంత శకుంతలగా నటించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.

‘శాకుంతంలం’ సినిమాపై భారీ అంచనాలు

‘శాకుంతలం’ సినిమాను కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించారు. తన కెరీర్ లో అద్భుత దృశ్య కావ్యంగా  ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. చారిత్రక సినిమాలను అద్భుతంగా తెరకెక్కించడంలో గుణ శేఖర్ ది అందెవేసిన చెయ్యి. దీంతో చాలా కాలం తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘శాకుంతలం’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.  ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ అద్భుత సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. 2Dతో పాటు 3D వెర్షన్‌ లోనూ రిలీజ్ అవుతోంది.      

‘శాకుంతంలం’ మూవీకి పోటీ విడుదలయ్యే సినిమాలు ఇవే!

అటు ‘శాకుంతలం’ సినిమా రోజునే మరికొన్ని చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘సర్’, మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘ధమ్కీ’, కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాలు సైతం అదే రోజున విడుదల కానున్నాయి.  

Read Also: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి సమంత ఔట్! - ఆ వదంతులే నిజమయ్యాయా?

టాప్ హెడ్ లైన్స్

Tejaswini Nandamuri Tollywood Debut : సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Newtons 3rd Law OTT : రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget