Samantha: ఆ సమయంలో ఎంతో బాధ అనుభవించా, ‘శాకుంతలం’ షూటింగ్ కష్టాలపై సమంత ఎమోషనల్ పోస్టు
హీరోయిన్ సమంత నటించిన తాజా సినిమా ‘శాకుంతలం‘ విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ సమయంలో పడ్డ ఇబ్బందుల గురించి సోషల్ మీడియా వేదికగా వివరించింది.
సౌత్ టాప్ హీరోయిన్ సమంతా గత కొంత కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స కోసం సినిమాలకు విరామం ప్రకటించింది. ఇంట్లో ఉంచి చికిత్స పొందారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడింది. ఈ నేపథ్యంలో సమంతా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు. గతంతో పోల్చితే చాలా బలహీనంగా కనిపించారు. ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమా డబ్బింగ్ లో పాల్గొంటున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల (ఫిబ్రవరి) 17న విడుదల కాబోతోంది.
View this post on Instagram
ఆ సమయంలో ఎంతో కష్టంగా ఫీలయ్యా!
తాజాగా ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ సమయంలో తాను పడ్డ కష్టాల గురించి వివరిస్తూ ఓ పోస్టు పెట్టారు. మయోసైటిస్ కారణంగా ఎలాంటి ఇబ్బంది కలిగిందో వివరించారు. “’శాకుంతలం’ సినిమాలో నటించే సమయంలో నా క్యారెక్టర్ కు తగినట్లుగా ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ ఒకేలా పెట్టడం, ఒకే భంగిమలో నిలబడడం చాలా కష్టంగా అనిపించేది. నడుస్తున్న సమయంలో, మాట్లాడుతున్నప్పుడు. పరిగెత్తేటప్పుడు, చివరకు ఏడుస్తున్న సమయంలోనూ ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ ఒకేలా పెట్టాల్సి వచ్చేది. అలా చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇలా ఉండటం కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాను. దానికంటే తన పెంపుడు కుక్క సాషాను తీసుకెళ్తే బాగుండేది” అంటూ తన కుక్క ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
View this post on Instagram
‘శాకుంతలం’ గురించి..
‘శాకుంతలం’ సినిమా ఒక పౌరాణిక కథతో తెరకెక్కుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో అద్భుత దృశ్యకావ్యంగా రూపొందుతోంది. ఈ సినిమా కాళిదాసు నాటకం ‘శకుంతల’ ఆధారంగా తీస్తున్నారు. శకుంతల పాత్రలో సమంత నటిస్తున్నారు. దుష్యంత రాజుగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. మోహన్ బాబు, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ‘శాకుంతలం’ ఫిబ్రవరి 17న పలు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. అటు సమంత ‘శాకుంతలం’ సినిమాతో పాటు విజయ్ దేవరకొండతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ‘కుషి’ అనే సినిమాలో నటిస్తున్నారు. మయోసైటిస్ కారణంగా కొన్ని బాలీవుడ్ సినిమాల నుంచి సమంతా ఇటీవలే తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దానిపై సమంత ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
Read Also: ‘ఆర్ఆర్ఆర్’ చూస్తుంటే పార్టీ ఎంజాయ్ చేసినట్టుంది - ఆస్కార్ విన్నర్ జెస్సికా ప్రశంసలు