Samantha : విజయ్ దేవరకొండ 'ఖుషి' టీమ్‌కు సమంత మెసేజ్? ఆ మాట చెప్పారా?
విజయ్ దేవరకొండకు జోడీగా సమంత నటిస్తున్న సినిమా 'ఖుషి'. కొన్నాళ్ళుగా ఈ సినిమా షూటింగుకు బ్రేక్ పడింది. తన వల్ల మిగతా వాళ్ళ టైమ్ వేస్ట్ కాకూడదని సమంత
సమంత ఆరోగ్య పరిస్థితి (Samantha Health Condition) ఎలా ఉంది? ఇప్పుడు జస్ట్ తెలుగు చిత్రసీమలో మాత్రమే కాదు... తమిళ, హిందీ ప్రేక్షకులతో పాటు పరిశ్రమ ప్రముఖులు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మైయోసిటిస్ నుంచి ఆమె పూర్తిగా కోలుకున్నారా? లేదా? అనేది ఎవరికీ తెలియడం లేదు. ఆ మధ్య సౌత్ కొరియాకి వెళ్ళారని, అక్కడ చికిత్స తీసుకుంటున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. లేదు... లేదు... హైదరాబాద్‌లో ఓ ఆయుర్వేద డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ జరుగుతోందని సమంత సన్నిహితుల నుంచి అందుతోన్న సమాచారం. ఆ సంగతులు పక్కన పెడితే...
మైయోసిటిస్ తనను బాధిస్తున్నప్పటికీ... 'యశోద' విడుదల సమయంలో సమంత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా ప్రచారానికి తన వంతు సహాయ సహకారాలు అందించారు. సినిమా పట్ల తనకు ఉన్న ఫ్యాషన్, డెడికేషన్ చాటుకున్నారు. ఇప్పుడూ తన వల్ల టీమ్ అందరూ వెయిట్ చేయకూడదని, టైమ్ వేస్ట్ కాకూడదని 'ఖుషి' చిత్ర బృందానికి సమంత ఓ మెసేజ్ పంపించారని వినికిడి. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పారట.
డిసెంబర్ 14 నుంచి మళ్ళీ 'ఖుషి'?
విజయ్ దేవరకొండకు జోడీగా సమంత నటిస్తున్న సినిమా 'ఖుషి' (Kushi Movie). 'మహానటి'లో వీళ్ళిద్దరూ నటించినా... దానిని ఈ జోడీ సినిమాగా చెప్పలేం. ఆ సినిమాలో వీళ్ళు ప్రధాన పాత్రధారులు మాత్రమే. ఇక, లేటెస్ట్ అప్‌డేట్ విషయానికి వస్తే...
చిత్రీకరణ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సమంత చెప్పడంతో డిసెంబర్ 14 నుంచి 'ఖుషి' కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట. అయితే... సమంత ఆ రోజు నుంచి షూటింగులో జాయిన్ అవుతారా? లేదంటే కొంత టైమ్ తీసుకుని సెట్స్‌కు వస్తారా? అనేది త్వరలో తెలుస్తుంది.
Also Read : తెలుగులో ఈ ఏడాది (2022లో) రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?
ఆల్రెడీ కశ్మీర్‌లో 'ఖుషి' షూటింగ్ కొంత షూటింగ్ చేశారు. అక్కడ యూనిట్ సభ్యుల సమక్షంలో సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అయితే, సమంత ఆరోగ్య పరిస్థితి కారణంగా షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి. ఈ విరామంలో 'లైగర్' సినిమా సమయంలో అయిన గాయాలకు విజయ్ దేవరకొండ చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ షూటింగ్ చేయడానికి రెడీ కావడంతో కొత్త షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే ఏడాది వేసవిలో 'ఖుషి'?
ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం కాకుండా షూటింగ్ వెనక్కి జరిగితే... షెడ్యూల్స్ వాయిదా పడితే... సినిమా విడుదల కూడా వెనక్కి వెళుతుంది! 'ఖుషి' విషయంలో అదే జరుగుతోందట. తొలుత ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తేదీకి ప్రేక్షకుల ముందుకు రావడం కష్టం. ఎందుకంటే... ఇంకా షూటింగ్ చాలా బ్యాలన్స్ ఉంది. అందుకని, ఫిబ్రవరిలో విడుదల చేస్తే ఎలా ఉంటుందని డిస్కషన్స్ జరిగాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఫిబ్రవరిలో కేసుల కష్టమేనని, వేసవికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్.
శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి 'ఖుషి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.