అన్వేషించండి

Samantha ice bath: ఐస్ బాత్‌తో టార్చర్ అనుభవిస్తున్న సమంత - సామ్‌కు ఏమైంది? ఎందుకలా చేస్తోంది?

సమంత ‘సిటాడెల్’ షూటింగ్ మధ్యలో ఐస్ బాత్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇంతకీ ఈ ఐస్ బాత్ థెరపీ వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్, డీకే ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ లండన్ లో కొనసాగుతోంది.

ఐస్ బాత్ థెరపీ తీసుకుంటున్న సమంత

సమంత ఈ సిరీస్ షూటింగ్ మధ్యలో ఐస్ బాత్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. తాజాగా తన ఐస్ బాత్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రొఫెషనల్ అథ్లెట్లు ఫిట్‌ నెస్ ఫ్రీక్స్ బాడీ కోసం ఐస్ బాత్ థెరపీ తీసుకుంటారు. ఇటీవల సమంత కూడా ఐస్ బాత్ చేస్తూ కనిపించింది. ‘సిటాడెల్’ యాక్షన్ సీక్వెన్స్ కోసం సమంత కఠినమైన వర్కౌట్స్ చేస్తోంది. నిపుణుల సమక్షంలో ట్రైనింగ్ తీసుకుంటోంది. అదే సమయంలో ఐస్ బాత్ థెరపీ చేయించుకుంటోంది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమంతా, ఈ థెరపీ ద్వారా ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తోంది. ఐస్ థెరపీ సమయంలో తీసిన ఫోటోను అభిమానులతో పంచుకుంటూ ‘ఇది టార్చర్ టైమ్” అంటూ క్యాప్షన్ పెట్టింది.   

ఐస్ బాత్ థెరపీ వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

ఐస్ బాత్ థెరపీతో గాయాల కారణంగా శరీరం ఏర్పడిన వాపును తగ్గించే అవకాశం ఉంటుంది.  అంతేకాదు, కష్టతరమైన వర్కౌట్స్ తర్వాత కండరాల పనితీరును సక్రమంగా ఉండేలా పునరుద్ధరించడంలో సహాయ పడుతుంది. చల్లటి, నీరు తగలడం వల్ల రక్తనాళాల వాపు తగ్గుతుంది. కండరాలకు ఆక్సిజన్ తో పాటు పోషకాలను కూడా అందిస్తుంది. కండరాల నొప్పులను నివారించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఐస్ బాత్ తో శరీరాన్ని చల్లబరచడం వల్ల మానసిక ఆరోగ్యం లభిస్తుంది. చక్కటి నిద్ర వస్తుంది. మీ శ్వాస సక్రమంగా జరిగేలా ఉపయోగపడుతుంది. ఐస్ బాత్ అనంతరం ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో ఇబ్బందికరంగానూ ఉంటుంది.  

సమంత ప్రస్తుతం మైయోసైటిస్ అనే కండరాల వ్యాధి నుంచి కోలుకుంటుంది. కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ చికిత్స తీసుకుంది. కఠినమైన ఆహార నిబంధనలు పాటించింది. ట్రైనర్స్ సాయంతో వర్కౌట్స్ చేసింది. ఆ తర్వాత వ్యాధి నుంచి చాలా వరకు బయటపడింది. గత కొంతకాలంగా వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా గడుపుతోంది. అప్పుడప్పుడు ఐస్ బాత్ థెరపీ చేయించుకుంటోంది. మరికొద్ది రోజుల్లోనే సమంత పూర్తి స్థాయిలో మైయోసైటిస్ నుంచి బయటపడే అవకాశం ఉంది.

View this post on Instagram
 
A post shared by Samantha (@samantharuthprabhuoffl)

‘సిటాడెల్’ షూటింగ్ సమంత బిజీ బిజీ

ప్రస్తుతం సమంత ‘సిటాడెల్’ ఇండియా వెర్షన్ లో నటిస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. రాజ్ & డీకే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు లండన్ లోనూ ఈ సిరీస్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ కావొచ్చినట్లు తెలుస్తోంది.  సమంత ఇటీవల లండన్‌లో జరిగిన ‘సిటాడెల్’ గ్లోబల్ ప్రీమియర్‌కు హాజరయ్యింది. అటు విజయ్ దేవరకొండతో కలిసి ‘కుషి’ సినిమాలో నటిస్తోంది.  

Read Also: ఎంతమందికి ముద్దు పెట్టానో తెలీదు, ఆమే నా సీక్రెట్ క్రష్ - నాగ చైతన్య!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget