అన్వేషించండి

Naga Chaitanya: ఎంతమందికి ముద్దు పెట్టానో తెలీదు, ఆమే నా సీక్రెట్ క్రష్ - నాగ చైతన్య!

నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’ సినిమా మే 12న విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో యూట్యూబర్ ఇర్ఫాన్ తో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తొలి బైలింగ్వల్ మూవీ ‘కస్టడీ’. దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 12న విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా తమిళ యూట్యూబర్ ఇర్ఫాన్ తో కలిసి ట్రూత్ ఆర్ డేర్ ఆడారు. ఈ గేమ్ లో నాగ చైతన్య పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇంతకీ ఆయన చెప్పిన ముచ్చట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యూట్యూబర్ ఇర్ఫాన్ తో చై గేమ్!   

ఇర్ఫాన్: మీ లైఫ్ లోబిగ్గెస్ట్ సీక్రెట్?

నాగ చైతన్య: నా జీవితంలో ఎలాంటి నిరాశ, విచారం లేదు. కానీ, కొన్ని సినిమాల విషయంలో కాస్త బాధపడిన సందర్భాలున్నాయి. సినిమాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అనిపించింది.

ఇర్ఫాన్: క్రష్ లేదా ఫార్ట్ నర్ దృష్టిని మీ మీదికి మళ్లించుకునేందుకు చేసిన పనికి మీరు ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డారా?

నాగ చైతన్య: అమ్మాయిల దృష్టిని మళ్లించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాను. స్కూల్ డేస్ లో ఇలాంటి సిల్లీ పనులు చాలా చేశాను. 

ఇర్ఫాన్: నీ సీక్రెట్ క్రష్ ఎవరు?

నాగ చైతన్య: ఈ మధ్య ఓ ఇంగ్లీష్ సినిమా చూశాను. దాని పేరు ‘బాబిలోన్’. ఇందులో మార్గోట్ రాబీ బాగా నచ్చింది. ఆమె ఫర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆమె మీద క్రష్ ఏర్పడింది.

ఇర్ఫాన్: ఇప్పటి వరకు నువ్ ఎంత మందిని కిస్ చేశావ్?

నాగ చైతన్య: నేను ఎంత మందిని కిస్ చేశానో నాకే తెలియదు. నా సినిమాల్లో చాలా కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు లెక్క పెట్టలేదు.

ఇర్ఫాన్: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు చేసే విచిత్రమైన పని ఏమిటి

నాగ చైతన్య: నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి విచిత్రమైన పని చేయను. కేవలం డ్రైవింగ్ మాత్రమే చేస్తాను. నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం. ఎంజాయ్ చేస్తాను. కానీ, విచిత్రమైన పనులు చేయను. ఎందుకంటే సేఫ్టీ అనేది చాలా ముఖ్యం.

ఇర్ఫాన్: ‘కస్టడీ’ మూవీ గురించి చెప్పండి?

నాగ చైతన్య: ఇది నా తొలి బహుభాషా చిత్రం. ఈ చిత్రంలో పూర్తి స్థాయిలో యాక్షన్ రోల్ పోషించాను. అరవింద్ స్వామి, శరత్ కుమార్ లాంటి స్టార్స్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

 

మే 12న ‘కస్టడీ’ రిలీజ్

నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటించిన ‘కస్టడీ’ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ కానుంది. మే 12న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి.  కస్టడీ మూవీలో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ గా కనిపిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాతోనే వెంకట్ ప్రభు టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో సీనియర్ నటులు అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి  కీలక పాత్రలు పోషించారు. 

Read Also: కుక్కలకూ బాధ కలుగుతుంది, అలా చేయొద్దని మీ పిల్లలకు చెప్పండి: యాంకర్ రష్మీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget