By: ABP Desam | Updated at : 27 Sep 2022 02:36 PM (IST)
దుల్కర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో సమంత - కన్ఫర్మ్ అయినట్లే!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 'మహానటి', 'సీతారామం' సినిమాలు తెలుగునాట దుల్కర్ ఫాలోయింగ్ ని అమాంతం పెంచేశాయి. దీంతో అతడితో కలిసి పని చేయడానికి చాలా మంది దర్శకులు ఆసాకుతో చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో 'కింగ్ ఆఫ్ కోతా'(King of Kotha) అనే పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు దుల్కర్ సల్మాన్. సోమవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత(Samantha)ను తీసుకున్నట్లు సమాచారం. చాలా రోజుల క్రితమే సమంతను కలిసి దర్శకుడు కథ వినిపించినట్లు తెలుస్తోంది. సమంత కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిగానే ఉన్నారు.
త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఈ మధ్యకాలంలో సమంత వరుస సినిమాలను లైన్ లో పెడుతుంది. ఇప్పుడు దుల్కర్ తో కలిసి నటించడానికి రెడీ అవుతుంది. ఇదివరకు వీరిద్దరూ కలిసి 'మహానటి' సినిమాలో కనిపించారు. కానీ అందులో సమంతకు, దుల్కర్ కి కాంబినేషన్ సీన్స్ లేవు. తొలిసారి వీరిద్దరూ కలిసి జంటగా కనిపించబోతున్నారు.
సమంతతో పాటు ఈ సినిమాలో మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కనిపించనున్నారు. అతడితో పాటు శోభిత ధూళిపాళ్ల, మనోజ్ బాజ్ పాయ్ నటిస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. మళయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక సమంత విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె నటించిన 'శాకుంతలం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది నవంబర్ 4న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో పాటు 'యశోద', 'ఖుషి' వంటి సినిమాలు ఆమె చేతిలో ఉన్నారు.
'యశోద' టీజర్ కి క్రేజీ రెస్పాన్స్:
సమంత నటించిన 'యశోద' సినిమా షూట్ ని కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వదిలారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'యశోద' సినిమా పూర్తిగా సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. సమంత ఇంతకు ముందు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈ సినిమా పూర్తిగా భిన్నంగా ఉంటుందని టాక్.
Also Read : కత్తి పట్టిన బాలకృష్ణ - విదేశాల్లో ఊచకోత
Also Read : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?
K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
K Viswanath Passed Away : బ్రేకింగ్ న్యూస్ - కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
Pawan Kalyan: రోడ్డు మీద వాంతి చేసుకుంటే బాబాయ్ క్లీన్ చేశారు - చరణ్ ఫోన్‌కాల్‌లో పవన్ గురించి ఏం అన్నారు?
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన మలుపు, ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు
YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్
Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్