Samantha - Ileana: ఇన్‌స్టాలో సమంత దూకుడు (2.2 కోట్లు) - ఇలియానా జోరు (1.4 కోట్లు)
ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. మరో హీరోయిన్ ఇలియానా కూడా ఫాలోయర్స్ పరంగా కొత్త మైలురాయి చేరుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత దూకుడు కొనసాగుతోంది. ఫాలోయర్స్ పరంగా ఆమె కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు వెళుతున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... సామ్ ఇన్‌స్టా ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య 22 మిలియన్స్‌కు (Samantha Ruth Prabhu reaches a new milestone on Instagram; clocks 22 million followers) చేరుకుంది. అంటే ఆమెను ఫాలో అవుతున్న వాళ్ళు అక్షరాలా 2.2 కోట్ల మంది. సమంత కంటే ముందు రష్మికా మందన్న చాలా ముందున్నారు. రష్మిక ఇన్‌స్టాను ఫాలో అవుతున్న వాళ్ళు 29.1 మిలియన్స్. సమంత విషయానికి వస్తే... 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తర్వాత ఉత్తరాదిలో ఆమెకు అభిమానులు పెరిగారు. త్వరలో రానున్న 'శాకుంతలం', 'యశోద' కూడా పాన్ ఇండియా సినిమాలు కావడంతో ఆమె ఫాలోయర్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read: సమంత - పూజా హెగ్డే మధ్య గొడవ ముగిసినట్టేనా!?
ఇలియానా జోరు!
హీరోయిన్ ఇలియానా కూడా ఇన్‌స్టా ఫాలోయర్స్ విషయంలో జోరు చూపిస్తున్నారు. ఆమెను 14 మిలియన్స్ (Ileana D'cruz hits 20 million followers on Instagram) ఫాలో అవుతున్నారు. దాంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆ మధ్య తాను లావుగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో సన్నగా కనిపిస్తున్నట్టు పోస్ట్ చేసిన ఫొటోలను ఆన్‌లైన్ యాప్స్ లో ఎడిట్ చేశారని ఇలియానా వెల్లడించారు. ఆ తర్వాత ఆమెకు మద్దతు పెరిగింది.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

