By: ABP Desam | Updated at : 05 Feb 2022 03:20 PM (IST)
ఇలియానా (Image Credit: Instagram/Ileana D'cruz)
ఇలియానా గత ఏడాది నవంబల్‌లో మాల్దీవులు వెళ్లారు. రెడ్ కలర్ బికినీలో దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. గుర్తుందా? పైన ఫొటోలో కుడి చేతి వైపు ఉన్న ఫొటో అదే! మరి, ఎడమ చేతి వైపు ఉన్నది ఎవరు? అనుకుంటున్నారా! అదీ ఇలియానా ఫొటోయే! అదేంటి... అంత లావుగా ఉన్నారేంటి? అనే సందేహం కలుగుతోందా? నిజం చెప్పాలంటే... ఇప్పుడు ఇలియానా ఒరిజినల్ రూపం అదే! మాల్దీవులు వెళ్ళినప్పుడు ఆమె ఆ రూపంలోనే ఉన్నారు!
మాల్దీవులు వెళ్ళినప్పుడు లావుగా ఉంటే సన్నగా ఎలా కనిపించారు? సన్నగా కనిపిస్తున్న ఫొటో సంగతి ఏంటి? అంటే... అదంతా యాప్స్ మహిమ. సన్నగా కనిపించడం కోసం యాప్స్ ఉపయోగించానని ఇలియానా చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాటితో తనకు అవసరం లేదని, ఆ యాప్స్ డిలీట్ చేశారని గర్వంగా చెబుతున్నానని ఆమె తెలియజేశారు. "ఇది నేను. నా బాడీలో ప్రతి అంగుళం, ప్రతి ఒంపును మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను" అని ఇలియానా పేర్కొన్నారు.
ఇలియానా పోస్ట్ ఎంతోమందిని కదిలించింది. లావుగా ఉన్న అందంగా ఉన్నారని చాలా మంది ఆమెకు సందేశాలు పంపుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు మద్దతు పెరుగుతోంది. బాడీ పాజిటివిటీ, సెల్ఫ్ లవ్ గురించి చాలా చక్కగా చెప్పారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గతంలోనూ ఒకసారి ఇలియానా బాడీ పాజిటివిటీ గురించి పోస్ట్ చేశారు. హీరోయిన్లు సన్నగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది, అభిమానిస్తారనేది అపోహ మాత్రమే అనేది ఇలియానాకు లభిస్తున్న మద్దతును బట్టి చెప్పవచ్చు.
Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!
GodFather Movie First Look: 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ - ఓల్డ్ గెటప్ లో మెగాస్టార్
Bimbisara Trailer: 'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే' - ట్రైలర్ అదిరిపోయింది!
Vishal accident: 'లాఠీ' షూటింగ్, మళ్లీ గాయపడ్డ విశాల్
DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్లో మేజర్ ఛేంజ్ - ఆ క్యారెక్టర్ ఉండదా?
IND Vs ENG 5th Test England Target: 245 పరుగులకు టీమిండియా ఆలౌట్ - ఇంగ్లండ్ లక్ష్యం భారీనే అయినా!
PM Modi In Bhimavaram : ప్రధాని ఏపీ పర్యటనలో అరుదైన ఘటన, స్వాతంత్య్ర సమర యోధుల కుమార్తెకు మోదీ పాదాభివందనం
KTR Andhra Angle : మొన్న ఎన్టీఆర్ - ఇవాళ అల్లూరి ! టీఆర్ఎస్ వేడుకల వెనుక రాజకీయం ఉందా ?
Whatsapp: ఇక రెండు రోజుల తర్వాత కూడా - వాట్సాప్ యూజర్లకు గుడ్న్యూస్!