అన్వేషించండి
Advertisement
Samantha: ఆ ఇద్దరితో సమంత డేట్ నైట్ - వైరలవుతోన్న ఫొటోలు
తన స్నేహితులతో డేట్ నైట్ కి వెళ్లింది సమంత. వారెవరంటే.. మేకప్ ఆర్టిస్ట్ సాధన, స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. ప్రస్తుతం ఆమె చేతుల్లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. తన స్నేహితులతో డేట్ నైట్ కి వెళ్లింది ఈ బ్యూటీ.
వారెవరంటే.. మేకప్ ఆర్టిస్ట్ సాధన, స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్.
వీరిద్దరూ సమంతకు బాగా క్లోజ్. ఆమె ఒప్పుకునే సినిమాలన్నిటికీ వీరు కూడా వర్క్ చేస్తుంటారు. వారిద్దరినీ సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తుంటుంది సమంత. వారు కూడా సమంతకు అండగా ఉంటారు. చైతుతో విడాకుల సమయంలో ప్రీతమ్ పేరు బాగా వినిపించింది. ఆ సమయంలో అతడు చాలా ఎమోషనల్ అయ్యాడు. సమంత తనకు సోదరితో సమానమని చెప్పుకొచ్చారు.
ఈ ఇన్సిడెంట్ తరువాత సమంత ఇతడిని దూరం పెడుతుందేమో అనుకున్నారు కానీ వారు మరింత క్లోజ్ అయ్యారు. ఇప్పుడు సాధన, ప్రీతమ్ తో డేట్ నైట్ ఎంజాయ్ చేసినట్లు చెప్పింది సమంత. 'యశోద' షూటింగ్ అనంతరం వీరు డిన్నర్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు.. సమంత 'ఖుషి' సినిమాలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. అలానే ఓ బైలింగ్యువల్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఒప్పుకుంది సమంత. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయబోతుంది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
సినిమా
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion