అన్వేషించండి
Advertisement
Pooja Hegde: పూజాహెగ్డే బర్త్ డే సెలబ్రేట్ చేసిన సల్మాన్, వెంకీ!
సల్మాన్, వెంకటేష్ కలిసి పూజాహెగ్డే బర్త్ డే సెలబ్రేట్ చేశారు.
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే(Pooja Hegde) ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా నటిస్తున్నారు. తన సొంత బ్యానర్ పై సల్మాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్(Venkatesh) కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగుతోంది.
కొత్త షెడ్యూల్ జరుగుతుండగానే పూజా పుట్టినరోజు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె బర్త్ డే వేడుకలను సెట్స్ లోనే నిర్వహించారు. సల్మాన్, వెంకటేష్ దగ్గరుండి పూజాతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక సినిమాలో పూజా అన్న పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వెంకటేష్ కు, సల్మాన్ కు మంచి దోస్తీ ఉంది. అందుకే సల్మాన్ తన సినిమాలో నటించాలని కోరడంతో వెంకీ వెంటనే ఓకే చెప్పారట. ఇదే సినిమాలో మరో కీ రోల్ జగపతి బాబు చేస్తున్నారట.
ఈ సినిమా నుంచి దర్శకుడు ఫర్హాద్ సమ్జీ తప్పుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే కరోనా వ్యాపించింది. దీంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. అయితే తొలి షెడ్యూల్ అవుట్ ఫుట్ చూసి.. సల్మాన్ నచ్చలేదని చెప్పారట. మళ్లీ రీషూట్ చేద్దామన్నారట. దర్శకుడు అవమానంగా ఫీలై.. వెంటనే సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆయన వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఈ సినిమా బాధ్యతలను సల్మాన్ ఖాన్ చూసుకుంటున్నారట. ఈ సినిమాని దర్శకుడి సహాయం లేకుండా తానే డైరెక్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడట.
ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు అని వార్తలొచ్చాయి. కానీ అభిప్రాయ బేధాలు రావడంతో ఈ సినిమా నుంచి దేవిశ్రీప్రసాద్ తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు చాలా మంది కంపోజర్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై దేవిశ్రీప్రసాద్ స్పందించారు.
'కీసీ కా బాయ్ కీసీ కీ జాన్' సినిమాలో అన్ని పాటలకు మ్యూజిక్ అందించాలని తనను అడగలేదని దేవి శ్రీ ప్రసాద్ తెలిపారు. తనను సంప్రదించే సమయానికి చిత్రబృందం దగ్గర కొన్ని పాటలు ఉన్నాయని.. కానీ దర్శకుడు స్క్రిప్ట్ ను వినిపించి పాటలు అందించాలని కోరారని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. కథను వినిపించేప్పుడు సినిమాలో చాలా పాటలకు చోటు ఉందని.. కానీ రన్ టైం పెరుగుతుండడంతో పాటల సంఖ్యను తగ్గించారని చెప్పారు. అదే విషయాన్ని తనకు కూడా చెప్పారని.. అయితే సల్మాన్ కోసం క్రేజీ సాంగ్ ను కంపోజ్ చేశామని.. అది అభిమానులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion