Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకు పెద్ద షాక్ అండ్ ట్విస్ట్ ఇచ్చారని చెప్పుకోవాలి. స్టోరీ పాయింట్ కూడా ఆయన చెప్పేశారు.
Prashanth Neel interview about Salaar movie: 'సలార్' విడుదలకు ఇంకా ఎన్నో రోజులు లేదు. మహా అయితే... మూడు వారాలు! ఇప్పటి వరకు ట్రైలర్ విడుదల కాలేదు. 'కెజియఫ్', 'కెజియఫ్ 2' సినిమాల్లో లార్జర్ దేన్ లైఫ్ హీరో పాత్రలో యశ్ కనిపించారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆయనను చూపించిన తీరు, హీరోయిజానికి యావత్ భారతీయ ప్రేక్షకులు జేజేలు కొట్టారు.
'సలార్'లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ను ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తారో? ఇంకా ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో? అని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో ప్రశాంత్ నీల్ స్టోరీ గురించి చిన్న లీక్ ఇచ్చారు.
స్నేహితులు బద్ధ శత్రువులు అయితే?
Salaar story leaked by Prashanth Neel: 'సలార్' ఇద్దరు స్నేహితుల కథ అని ప్రశాంత్ నీల్ చెప్పారు. పరిస్థితుల కారణంగా ఆ స్నేహితులు ఇద్దరూ శత్రువులు అయితే ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాలని చెప్పారు. కథలో ఎమోషన్స్ చాలా ఉన్నాయని, ఆరు గంటల సినిమా వస్తోందని, అందుకని రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. దాంతో పాటు ఆయన పెద్ద ట్విస్ట్ కూడా ఇచ్చారు.
'సలార్' సినిమాలో వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. ప్రభాస్, పృథ్వీరాజ్ స్నేహితులు నుంచి శత్రువులుగా మారిన వ్యక్తులుగా కనిపించవచ్చు.
'కెజియఫ్' వేరు.... 'సలార్' వేరు!
Is Salaar and KGF 3 connected? 'సలార్' మొదలైనప్పటి నుంచి 'కెజియఫ్'కు, దీనికి సంబంధం ఉంటుందని చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు అందరూ భావిస్తున్నారు. 'కెజియఫ్'లో ఈశ్వరి రావు కుమారుడి పేరు సలార్ కావడం, ఆమె ప్రభాస్ 'సలార్' సినిమాలో ఉండటంతో... రెండు సినిమాలను ప్రశాంత్ నీల్ ఏ విధంగా లింక్ చేస్తారని ఎవరికి వారు తమకు తోచిన విధంగా కథలు అల్లేశారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ చెప్పేది వింటే... అంతకు మించి షాక్ తగులుతుంది.
Also Read: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?
'కెజియఫ్', 'సలార్' మధ్య సంబంధం లేదని బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. రెండిటి మధ్య లింక్ లేదని ఆయన స్పష్టం చేశారు. 'సలార్', 'కెజియఫ్' ప్రపంచాలు వేర్వేరు అని ప్రశాంత్ నీల్ చెప్పారు. అయితే... 'కెజియఫ్'లో ఉన్నట్లు, 'సలార్'లో కూడా సాలిడ్ (స్ట్రాంగ్) యాక్షన్ సీన్లు ఉంటాయని వివరించారు. అదీ సంగతి!
Also Read: యానిమల్ వయలెన్స్... సలార్ యాక్షన్... డిసెంబర్‌లో ధూమ్ ధామ్ థియేటర్లలోకి భారీ అండ్ క్రేజీ సినిమాలు
Who is the heroine in Salaar: డిసెంబర్ 1న రాత్రి 7.11 గంటలకు 'సలార్' ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రలో ఆమె నటించారు ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు నిర్వర్తించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply