Sai Dharam Tej: ‘జబర్దస్త్’ షోలో ‘విరూపాక్ష’ టీమ్ - యాంకర్ సౌమ్యపై సాయి ధరమ్ తేజ్ పంచులే పంచులు!
‘జబర్దస్త్’ కు ‘విరూపాక్ష’ టీమ్ రావడంతో సెట్ లో అంతా సందడి వాతావారణం నెలకొంది. రావడం రావడంతోనే హీరో సాయి ధరమ్ తేజ్ తనదైన పంచ్ డైలాగ్ లతో ఆకట్టుకున్నారు.
Sai Dharam Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. టీజర్ కొత్తగా ఉత్కంఠ రేపే విధంగా ఉండటంతో సినిమా పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది. అందులో భాగంగా పలు కార్యక్రమాలకు హాజరవుతూ సినిమాను ప్రమోషన్ చేస్తోంది టీమ్. తాజాగా ఈ మూవీ టీమ్ ‘జబర్దస్త్’ షోకు వెళ్లింది. హీరో సాయి తేజతో పాటు హీరోయిన్ సంయుక్త మీనన్, దర్శకుడు కార్తీక్ దండు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ చేసిన ఫన్ అందర్నీ ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు.
‘జబర్దస్త్’ కు ‘విరూపాక్ష’ టీమ్ రావడంతో సెట్ లో అంతా సందడి వాతావారణం నెలకొంది. రావడం రావడంతోనే హీరో సాయి ధరమ్ తేజ్ తనదైన పంచ్ డైలాగ్ లతో ఆకట్టుకున్నారు. యాంకర్ సౌమ్య రావుపై పలు పంచ్ లు వేసి నవ్వించారు. యాంకర్ సౌమ్యను యాంజిల్‌లా అందంగా ఉన్నారంటూ పొగిడారు సాయి ధరమ్ తేజ్ దానికి సౌమ్య సిగ్గుపడుతుంటే.. మిమ్మల్ని కాదులేండి అంటూ పంచ్ వేశారు. తర్వాత యాంకర్ సౌమ్య సాయి ధరమ్ తేజ్ ను ‘‘మీలో ఎవరు ఎక్కువ టేక్ లు తీసుకున్నారు’’ అని అడిగితే దానికి సాయి బదులిస్తూ ‘‘మేము ఇద్దరం కాదు, డైరెక్టర్ ఎక్కువ టేక్ లు తీసుకున్నారు’’ అంటూ డైలాగ్ వేశారు. దీంతో సెట్ లో నవ్వులు విరిశాయి. తర్వాత రాకెట్ రాఘవ స్కిట్ చేసిన తర్వాత ఎలా ఉంది అని జడ్జెస్ ను అడిగింది యాంకర్ సౌమ్య. ఈ సందర్భంగా రాఘవ కలుగజేసుకొని ‘విరూపాక్ష’ టైటిల్ బాగుంది సర్ అని డైరెక్టర్‌కు తెలిపాడు. దానికి డైరెక్టర్ కార్తీక్ స్పందిస్తూ.. ‘‘మీరే చెప్పండి, టీజర్ చూశారా ఎలా ఉంది’’ అని అడిగితే దానికి రాఘన ‘‘నేను చూశాను, కానీ నిజంగా వచ్చిందా ట్రైలర్’’ అని పక్కవాళ్లని అడగడంతో ఫన్ క్రియేట్ అయింది. ఇలా ఈ ప్రోమో మొత్తం నవ్వులతో నిండిపోయింది. పూర్తి ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.
ఇక ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండటంతో మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఈ మధ్య సుకుమార్ శిష్యులు దర్శకులుగా మారి మంచి సూపర్ హిట్ లను అందుకున్నారు. వారిలో బుచ్చిబాబు సనా ‘ఉప్పెన’ సినిమాతో మంచి హిట్ అందుకోగా రీసెంట్ గా శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇప్పుడు కార్తీక్ దండు వంతు వచ్చింది. అందుకే ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో ఈ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాపై మంచి హోప్స్ తో ఉన్నారు. ఆయన గతంలో నటించిన మూవీలు అంతగా ఆకట్టుకోవపోవడంతో ఈ మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో సాయి ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమాలో నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 21, 2023 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Also Read : 'శాకుంతలం' రివ్యూ : సమంత సరిగా చేయలేదా? గుణశేఖర్ బాగా తీయలేదా?