Pushpa Russian Trailer: ‘పుష్ప’ రష్యన్ ట్రైలర్ వచ్చేసింది, రిలీజ్ ఎప్పుడంటే?
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన తాజా సినిమా ‘పుష్ప’. ఇండియాలో సాలిడ్ హిట్ అందుకున్న ఈ మూవీ రష్యాలో విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా రష్యన్ భాషలో విడుదలైన ట్రైలర్ సినీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
ఆకట్టుకుంటున్న ‘పుష్ప’ రష్యన్ ట్రైలర్
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రం దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా త్వరలో రష్యాలో విడుదల కాబోతోంది. డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా రష్యాలో మొదలయ్యాయి. అందులో భాగంగానే రష్యన్ భాషలో పుష్ప ట్రైలర్ విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
View this post on Instagram
వచ్చే ఏడాది డిసెంబర్ లో ‘పుష్ప-2’ విడుదల
ఇక ‘పుష్ప-2’ సంబంధించిన షూటింగ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.గతేడాది ‘పుష్ప’ సినిమా ఏ రోజున విడుదల అయ్యిందో వచ్చే ఏడాది అదే సమయానికి ‘పుష్ప-2’ విడుదల చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే, క్రిస్మస్ కు ఓ వారం ముందు పుష్ప సినిమా విడుదల కాగా, పుష్ప-2 మాత్రం క్రిస్మస్ వీకెండ్ రోజున థియేటర్లలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. వచ్చే ఏడాది డిసెంబర్ లో పుష్ప-2 విడుదల కోసం చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.
అనుకున్న సమయం కంటే ఆలస్యంగా షూటింగ్
వాస్తవానికి 'పుష్ప 2' షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ కావాలి. కానీ, తొలి భాగం మంచి విజయాన్ని అందుకోవడంతో రెండో పార్ట్ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా ఎక్కువగా చేశారు. ఇప్పటికే ఈ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి బ్యాంకాక్ లో రెండు వారాల పాటు షెడ్యూల్ కొనసాగనుంది. అక్కడి అడవుల్లో కీలక సన్నివేశాలను చిత్రీచరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు సుకుమార్ బ్యాంకాక్ లో మకాం వేశారు. సినిమా షూటింగ్ కు సంబంధించిన లొకేషన్స్ ఓకే చేస్తున్నారు. ఈ సినిమాలో 30 శాతానికి పైగా అక్కడే షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉన్న బన్నీ, అక్కడి నుంచి నేరుగా బ్యాంకాక్ కు వెళ్లనున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘పుష్ప-2’పై భారీగా అంచనాలు నెలకొనడంతో భారీ బడ్జెట్ ను పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫహాద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
Read Also: కోలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి సందడి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన గౌతమ్, మంజిమా