Gautham Karthik-Manjima Mohan Marriage: కోలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి సందడి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన గౌతమ్, మంజిమా
కోలీవుడ్ లవ్ బర్డ్స్ గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చెన్నైలో వీరిద్దరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు వీరి పెళ్లికి హాజరై ఆశీర్వదించారు.
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్
గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న కోలీవుడ్ ప్రేమ జంట గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ వివాహం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో చెన్నైలో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. ఓ హోటల్ లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను మంజిమా మోహన్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసింది. పెళ్లి దుస్తుల్లో వధూవరులు అందంగా మెరిసిపోతూ కనిపిస్తున్నారు. తెలుపు రంగు పట్టు పంచె, చొక్కాతో గౌతమ్, వైట్ సారీలో మంజిమా మోహన్ కనువిందు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు నూతన వధూవరులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
‘దేవరట్టం’ సినిమా షూటింగ్ సమయంలో చిగురించిన ప్రేమ
గౌతమ్ కార్తీక్-మంజిమా మోహన్ కలిసి 2019 ‘దేవరట్టం’ అనే తమిళ సినిమాలో నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినా, వారి ప్రేమ మాత్రం సక్సెస్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. కొంత కాలంగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దాదాపు మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా తమ ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పింది. తానే మంజిమాకు లవ్ ప్రపోజ్ చేసినట్లు గౌతమ్ తెలిపాడు.
తెలుగులోనూ సినిమాలు చేసిన గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్
అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబోలో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో మంజిమా మోహన్ తెలుగులోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలో నారా భువనేశ్వరి పాత్ర పోషించింది. ఇక మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘కడలి’ సినిమాతో గౌతమ్ కార్తీక్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమ్యాడు.
Read Also: రష్మికపై బ్యాన్, ఇక ఆమె సినిమాలు కూడా విడుదలకావట!