Naatu Naatu Song: ‘ఆస్కార్’ వేదికపై ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్ చేస్తా: రామ్ చరణ్
‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డు కూడా వస్తే ‘నాటు నాటు’ డ్యాన్సుతో దుమ్మురేపుతాం అని చెప్పారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట 80వ గోల్డెన్ గ్లోబ్స్ లో బెస్ట్ సాంగ్(మోషన్ పిక్చర్) అవార్డును గెలుచుకుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ పాటకు చేసే ఈ డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతో అలరించింది. ఇద్దరి మధ్య స్నేహానికి స్పూర్తిగా ఈ పాట ఉంటుంది. ఈ విభాగంలో ప్రపంచ ప్రఖ్యాత సింగర్స్ టైలర్ స్విఫ్ట్, రిహన్న, లేడీ గాగా వంటి వారిని వెనక్కి నెట్టి ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకుంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు.
ఒక్కసారి కాదు 17 సార్లు డ్యాన్స్ చేస్తాం - రామ్ చరణ్
95వ అకాడెమీ అవార్డుల కోసం ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ షార్ట్ లిస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకుంటే.. అదే వేదికపై తాను, జూనియర్ ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేస్తామని రామ్ చరణ్ చెప్పారు. NBP పోడ్ కాస్ట్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘నాటు నాటు’ నామినేట్ అయితే జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆస్కార్ వేదికపై డ్యాన్స్ చేస్తారా? అని చరణ్ ను జర్నలిస్టు అడిగారు. ఈ ప్రశ్నకు రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పారు. “వారు మాకు అవార్డు ఇస్తే ఎందుకు చేయం? ఒక్కసారి కాదు ఎన్టీఆర్, నేను కలిసి 17 సార్లు డ్యాన్స్ చేస్తా చేస్తాం” అని చెప్పారు.
ఆస్కార్ అవార్డు పొందేనా?
బెస్ట్ సాంగ్ కేటగిరీలో ‘RRR’ ‘నాటు నాటు’ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడంతో, ఆస్కార్ అవార్డుపై అంచనాలు పెరిగాయి. వాస్తవానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ను ఆస్కార్ అవార్డులకు ఎంట్రీగా భావిస్తుంటారు. ఇక్కడ అవార్డులు అందుకుంటే, అక్కడ అవార్డులు పొందే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. జనవరి 24న ఆస్కార్ అవార్డుల ప్రకటన ఉండబోతోంది. ఇప్పటికే ‘RRR’ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ లో టాప్ ప్రైజ్ – బెస్ట్ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. న్యూయార్క్ లోని TAO డౌన్ టౌన్ రెస్టారెంట్ లో జరిగిన వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని తీసుకున్నారు.
స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కల్పిత కథ ఆధారంగా ‘RRR’ సినిమా తెరకెక్కింది. 1920లోని ఇద్దరు నిజ జీవిత భారతీయ విప్లవకారులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్‌ల చుట్టూ ఈ కల్పిత కథ అల్లారు. ఈ పాత్రల్లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది.
View this post on Instagram
Read Also: ‘RRR’ టీమ్‌కు అలియా గ్రాండ్ ఫార్టీ, ఎప్పుడు? ఎక్కడో తెలుసా?