(Source: ECI/ABP News/ABP Majha)
RRR Record In Japan: జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’ హవా, వంద కోట్ల వసూళ్ల దిశగా మూవీ
గతేడాది అక్టోబర్ 21 న జపాన్ దేశంలో ‘ఆర్ఆర్ఆర్’ విడుదల చేశారు. అక్కడ కూడా మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచీ సంచలనాలను క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ సినిమా అంర్జాతీయంగా ప్రశంసలు అందుకోడమే కాకుండా ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవలే ఈ మూవీలో ‘నాటు నాటు’ పాటకు గానూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వరించింది. దీంతో ఈ మూవీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. ఈ సంతోషంలో ఉండగానే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మరో సరికొత్త రికార్డును సృష్టించింది. అదేంటంటే.. ఈ సినిమాను గతేడాది అక్టోబర్ 21 న జపాన్ దేశంలో విడుదల చేశారు. అక్కడ కూడా ‘ఆర్ఆర్ఆర్’ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజగా జపాన్ లో 80 కోట్లు కలెక్షన్లు సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డుకెక్కింది.
‘ఆర్ఆర్ఆర్’ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు రావడంతో ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అక్కడ కూడా ‘ఆర్ఆర్ఆర్’ తన సత్తాను చాటింది. ఈ సినిమాను అక్కడ విడుదల చేసినప్పటినుంచీ నిరంతరాయంగా థియేట్రికల్ రన్ కొనసాగుతూ దిగ్విజయంగా 20 వ వారంలోకి ప్రవేశించింది. అంతే కాదు ఇప్పటి వరకూ 80 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. జపాన్ లో 44 నగరాలలో 209 స్క్రీన్ 31 ఐమాక్స్ లలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన సినిమాగా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ టైమ్ ముగిసే సరికి 100 కోట్ల కలెక్షన్లను సాధిస్తుందని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. నిజంగా జపాన్ లో ఈ మూవీ 100 కోట్ల మార్క్ దాటితే మరో సంచలనమే అవుతుందని చర్చించుకుంటున్నారు ఫిల్మ్ లవర్స్.
ఇక ఇటీవలే ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. మొట్టమొదటి సారిగా ఓ పక్కా ఇండియన్ సినిమాకు ఆస్కార్ రావడంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 13 న అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకల్లో ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వరించింది. అలాగే విశ్వవేదికపై ‘నాటు నాటు’ పాట లైవ్ ప్రదర్శనతో ఆస్కార్ వేదిక దద్దరిల్లింది. ఆస్కార్ రాకతో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఇటీవలే మూవీ టీమ్ అమెరికా నుంచి తిరిగి స్వదేశానికి వచ్చింది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్వాతంత్య్రానికి పూర్వం 1920 లో జరిగిన కల్పిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. అల్లూరి సీతరామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీర్ నటించారు. బ్రటీష్ పాలకులకు వ్యతిరేకంగా చరణ్, ఎన్టీఆర్ చేసే పోరాట సన్నివేశాలు ఆడియన్స్ కట్టిపడేశాయనే చెప్పాలి. అందుకే ఈ సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
This tweet's engagement & compliments demonstrate how RRR is gradually penetrating into the roots of Japan with each passing day.
— RRR Movie (@RRRMovie) March 15, 2023
Glad that the film is drawing exceptionally high footfalls & is currently running in 202 cinemas in its 20th week!
Love you Japan ❤️🙏🏻 #RRRinJapan https://t.co/PNzYxCnsUj