RRR : రెండు ఓటీటీల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమా - రిలీజ్ ఎప్పుడంటే?
'ఆర్ఆర్ఆర్' సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఓవరాల్ గా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. 'కేజీఎఫ్2' లాంటి సినిమా విడుదలైనా 'ఆర్ఆర్ఆర్' క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ఈ సినిమా ఆడుతోంది.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్. కానీ దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. జీ5, నెట్ ఫ్లిక్స్ లలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే డేట్ విషయంపై మాత్రం క్లారిటీ లేదు.
మరోపక్క ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను, ఆల్ లాంగ్వేజెస్ ఓటీటీ హక్కులను దక్కించుకున్న 'పెన్ స్టూడియోస్' అధినేత జయంతి లాల్.. సినిమా విడుదలైన మూడు నెలల తరువాతే ఓటీటీలోకి వస్తుందని ఇంతకముందు చెప్పారు. అలా చూసుకుంటే మార్చి 22న ఈ సినిమా విడుదలైంది.. అంటే జూన్ 22కి కానీ సినిమాను రిలీజ్ చేయడానికి లేదు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
Also Read: 'ఎఫ్3' ట్రైలర్ డబ్బింగ్ పూర్తి చేసిన వెంకీ - ఫ్యాన్స్ రెడీనా?
Also Read: మహేష్ బాబుని మూడు సార్లు కొట్టిన కీర్తి సురేష్ - మరీ అంత కోపమా?
View this post on Instagram