News
News
వీడియోలు ఆటలు
X

RRR: ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన డీఓపీ సెంథిల్ కుమార్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కలెక్షన్ల పరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాకుండా..

FOLLOW US: 
Share:

RRR: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కలెక్షన్ల పరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాకుండా మూవీలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంతో అంతర్జాతీయంగా ప్రశంసలను అందుకుంది. దీంతో ఈ మూవీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆస్కార్ అవార్డు వచ్చి చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఈ సినిమా పేరు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది. అంతలా ఈ సినిమా ప్రపంచ ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్, ఆస్కార్ రాకతో మూవీ టీమ్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఆస్కార్ రాకను సెలబ్రేషన్స్ చేసుకున్నారు చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా డిఓపి సెంథిల్ కుమార్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను ఏర్పాటు చేశారు. మూవీ టీమ్ అందరికీ ప్రత్యేకంగా పార్టీను ఏర్పాటు చేశారు.

‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్, ఆస్కార్ రాకను సెలబ్రేట్ చేస్తూ గతంలో రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ లు మూవీ టీమ్ సభ్యులకు పార్టీ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా సినిమా డీఓపీ సెంథిల్ కుమార్ సెలబ్రేషన్ పార్టీను ఏర్పాటు చేశారు. ఈ పార్టీకు రాజమౌళి, రమా రాజమౌళి, రామ్ చరణ్, ఎస్ఎస్ కార్తికేయ, ఎంఎం కీరవాణి తదితరులు పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ పార్టీకు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరుకాలేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ బిజీగా గడుపుతున్నారు. దీంతో ఈ పార్టీకు ఆయన హాజరుకాలేకపోయారు. ఈ పార్టీకు సంబంధించిన చిత్రాలను డీఓపీ సెంథిల్ కుమార్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

ఇక రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్టును సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదట ఈ మూవీను సింగిల్ పార్ట్ లో తెరకెక్కించాలని అనుకున్నారట రాజమౌళి. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తో రాజమౌళి క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోవడంతో మహేష్ సినిమాను ఏకంగా 3 పార్ట్ లుగా తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్ ను సిద్దం చేస్తున్నారట. ఇక ఈ మూవీతో రాజమౌళి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి. ఈ మూవీకు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే విడుదల చేయనున్నారు మేకర్స్. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా మూవీ తెరకెక్కనుందని సమాచారం. అలాగే ఎన్టీఆర్ కూడా ‘ఎన్టీఆర్ 30’ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 

View this post on Instagram
 
A post shared by Senthil Kumar (@dopkksenthilkumar)

Published at : 17 Apr 2023 01:16 PM (IST) Tags: RRR Rajamouli TOLLYWOOD DOP Senthil Kumar RRR Celebration

సంబంధిత కథనాలు

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో

Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!