Ved Collection : మరాఠీ 'మజిలీ' @ 50 కోట్లు, చై-సామ్ సినిమా అక్కడా హిట్టే!
Ved Box Office Collections : నాగ చైతన్య, సమంత నటించిన 'మజిలీ'ని మరాఠీలో 'వేద్'గా రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది.
మరాఠీలో డిసెంబర్ 30న 'వేద్' (Ved Marathi Movie) అని ఓ సినిమా విడుదలైంది. అందులో నిజ జీవితంలో భార్యా భర్తలైన జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్ నటించారు. 'వేద్' ప్రచార చిత్రాలు చూస్తే... తెలుగు జనాలకు ఓ సినిమా గుర్తుకు వచ్చింది. అది ఏమిటంటే..
మన 'మజిలీ' రీమేకే 'వేద్'
'వేద్' టీజర్, ట్రైలర్ చూసిన తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఏమీ అనిపించలేదు. వై? ఎందుకు? అంటే... ఆల్రెడీ చూసిన తెలుగు సినిమా సన్నివేశాలను మరాఠీలో మరొక జంట నటించగా చూసినట్టు ఉంది. తెలుగులో సూపర్ హిట్ 'మజిలీ'కి అది రీమేక్ కాబట్టి!
అవును... అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ'కి మరాఠీ రీమేక్ 'వేద్'. ఇక్కడ నాగ చైతన్య చేసిన పాత్రను అక్కడ రితేష్, సమంత పాత్రలో జెనీలియా నటించారు. మరాఠీలో కూడా 'మజిలీ' రీమేక్ మంచి వసూళ్ళు సాధించింది.
'వేద్' @ 50 కోట్లు
'వేద్' విడుదలై మూడు వారాలు అయినప్పటికీ... మంచి వసూళ్ళు రాబడుతోంది. మహారాష్ట్రతో పాటు కొన్ని ఏరియాల్లో విడుదలైన 'వేద్'కు ఫస్ట్ వీకెండ్, ఆ తర్వాత మండే కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. నాలుగు రోజుల్లో రూ. 13 కోట్లు కలెక్ట్ చేసిందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మూడో వారంలో ఈ సినిమా 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. మరాఠీలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా 'వేద్' రికార్డు క్రియేట్ చేసిందని సమాచారం.
Also Read : 'మిషన్ మజ్ను' రివ్యూ : రష్మిక 'మజ్ను' గురి తప్పిందా? బావుందా?
#Marathi film #Ved posts a SOLID TOTAL in Week 3… Crosses ₹ 50 cr… Is now a certified BLOCKBUSTER… [Week 3] Fri 1.35 cr, Sat 2.72 cr, Sun 2.74 cr, Mon 1.04 cr, Tue 78 lacs, Wed 70 lacs, Thu 62 lacs. Total: ₹ 50.80 cr. pic.twitter.com/2zvFaognTG
— taran adarsh (@taran_adarsh) January 20, 2023
తెలుగులో 'మజిలీ' విడుదలైన సమయానికి నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోలేదు. వాళ్ళు ఇద్దరూ భార్యాభర్తలు. నిజ జీవితంలో జంట వెండితెరపై కూడా జంటగా కనిపించడం... చైతన్య కాళ్ళకు సమంత నమస్కరించడం వంటి కొన్ని సన్నివేశాలు, సినిమాలో భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. తెలుగునాట సినిమా భారీ వసూళ్ళు సాధించింది.
మరాఠీలో కూడా సేమ్ మేజిక్ రిపీట్ అవుతోంది. రితేష్, జెనీలియా రియల్ లైఫ్ కపుల్. స్క్రీన్ మీద కూడా కపుల్ రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో వాళ్ళ మధ్య జరిగే సరదా సంభాషణలకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. నిజ జీవితంలో వాళ్ళ బంధంతో పోలిస్తే... స్క్రీన్ మీద క్యారెక్టర్స్ డిఫరెంట్. కానీ, వాళ్ళ రియల్ లైఫ్ రిలేషన్, ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. కలెక్షన్స్ రాబడుతున్నాయి.
Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే?
అన్నట్టు... 'వేద్'కు రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించారు. జెనీలియా డిసౌజా నిర్మించారు. హీరో హీరోయిన్లుగా మాత్రమే కాదు... దర్శకుడిగా భర్త, నిర్మాతగా భార్య కూడా విజయం అందుకున్నారు. మూడు విధాలుగా 'మజిలీ' వాళ్ళకు వర్కవుట్ అయ్యింది.
పెళ్ళి తర్వాత తెలుగు తెరకు దూరమైన జెనీలియా త్వరలో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డి కథానాయకుడిగా పరిచయం చేస్తూ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమాలో జెనీలియా నటిస్తున్నారు. అందులో శ్రీలీల మరో కథానాయిక. అది పాన్ ఇండియా సినిమా.