News
News
X

Like Share Subscribe Trailer: ప్రభాస్ చేతుల మీదుగా Like, Share, Subscribe ట్రైలర్, ఇదిగో చూసేయండి

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తోన్న యువ హీరో సంతోష్ శోభన్ ఒకరు. ప్రస్తుతం సంతోష్ శోభన్ నటిస్తోన్న తాజా సినిమా 'లైక్, షేర్, సబ్స్క్రయిబ్'.

FOLLOW US: 

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తోన్న యువ హీరో సంతోష్ శోభన్. ప్రస్తుతం సంతోష్ శోభన్ నటిస్తోన్న తాజా సినిమా Like, Share, Subscribe. సినిమా టైటిల్ చాలా కొత్తగా ఉండటంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండేలా ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. పేపర్ బాయ్ మూవీ తో తన కెరీర్ ను మొదలు పెట్టి ఏక్ మినీ కథ మూవీ తో మంచి పేరు తెచ్చుకున్నాడు శోభన్. ఈ సినిమా సక్సెస్ తో మంచి రోజులు వచ్చాయి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఏక్ మినీ కథకు కథ అందించిన మేర్లపాక గాంధీనే లైక్ షేర్ సబ్స్క్రయిబ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 

హీరో నితిన్ తో 'మ్యాస్ట్రో' సినిమా తర్వాత గాంధీ నుంచి వస్తోన్న సినిమా ఇది. మ్యాస్ట్రో సినిమా అనుకున్నంత గా హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు మేర్లపాక గాంధీ. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడట. అందుకే ప్రతీ అప్డేట్ ను ఎంతో వినూత్నంగా అనౌన్స్ చేస్తున్నారు. అందుకే సినిమా ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేసింది మూవీ టీమ్. 

వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా  నటిస్తోంది. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ టీమ్. నవంబర్ 4 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో అయినా హీరో శోభన్, దర్శకుడు గాంధీకు మంచి సూపర్ డూపర్ హిట్ అందుకుంటారేమో చూడాలి.

ట్రైలర్‌ను ఇక్కడ చూడండి:

News Reels

సినిమా ట్రైలర్ చూస్తే సినిమాలో హీరో సంతోష్ శోభన్ ఒక ట్రావెల్ బ్లాగర్. ఫారియా అబ్దుల్లా ను ఈ సినిమాలో గ్లామరస్ హీరోయిన్ గా చూపించారు. ట్రైలర్ లో డైలాగ్స్ తక్కువే ఉన్నా.. ‘‘దుస్యాసునుడు ద్రౌపతి చీర లాగినపుడు శ్రీకృష్ణుడు చీర పంపే వరకూ వెయిట్ చేసింది. కానీ, కౌరవులను మాత్రం కమిలిపోయేలా కొట్టలేదు’’ అనే డైలాగ్ యూత్‌కు నచ్చుతుంది.

ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. మొత్తంగా ట్రైలర్ చూస్తే ఈ సినిమా సస్పెన్స్ కామెడీ డ్రామా మూవీ లా అనిపిస్తోంది. సినిమాలో ఫారెస్ట్ బ్యాగ్రౌండ్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయనిపిస్తోంది. ఈ సినిమా కూడా మేర్లపాక గాంధీ తీసిన వెంకటాద్రి ఎక్స్‌‌ప్రెస్ తరహాలో ట్రావెల్ లో జరిగే కథలా అనిపిస్తుంది. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో ఆడియన్స్ కూడా ఈ సినిమా ట్రైలర్ ను లైక్, షేర్ చేస్తున్నారు. 

Also Read: సంక్రాంతి సమరంలో బడా స్టార్స్ - ప్రభాస్, చిరంజీవి, బాలయ్యతో పోటీకి సిద్ధమైన అఖిల్, విజయ్!

Aslo Read: నయన్, చిన్మయి to శ్రియ - తల్లైన, పెళ్లైన తారల దీపావళి సంబరాలు

Published at : 25 Oct 2022 11:11 AM (IST) Tags: Prabhas Santosh Sobhan like share subscribe Farida abdullah

సంబంధిత కథనాలు

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

Sunset Circle Awards 2022 : ఆస్కార్‌కు ముందు 'ఆర్ఆర్ఆర్'కు ఇంటర్నేషనల్ అవార్డులు - దర్శకుడిగా రాజమౌళికి...

Sunset Circle Awards 2022 : ఆస్కార్‌కు ముందు 'ఆర్ఆర్ఆర్'కు ఇంటర్నేషనల్ అవార్డులు - దర్శకుడిగా రాజమౌళికి...

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'