News
News
X

Ram Charan: చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ షురూ - రాజమండ్రిలో షూటింగ్!

రామ్ చరణ్ కొత్త షెడ్యూల్ ను రాజమండ్రిలో మొదలుపెట్టారు. 

FOLLOW US: 
 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను(RC15) రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. మొదట అక్టోబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. కానీ శంకర్ 'ఇండియన్2' సినిమాను టేకప్ చేయడంతో.. చరణ్ సినిమా ఆలస్యమవుతుందనుకున్నారు. 

'ఇండియన్ 2', 'RC15' సినిమాలను సమాంతరంగా చిత్రీకరించబోతున్నట్లు చెప్పారు శంకర్. కానీ తన ఫోకస్ మొత్తం 'ఇండియన్2' సినిమాపైనే పెట్టినట్లు వార్తలొచ్చాయి. రామ్ చరణ్ తో మొదలుపెట్టాలనుకున్న కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టకపోవడంతో.. చరణ్ ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఈ విషయంలో అటు రామ్ చరణ్, ఇటు దిల్ రాజు హర్ట్ అయినా.. ఏమీ అనలేని పరిస్థితి. అయితే ఇప్పుడు చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి రాజమండ్రిలో షూటింగ్ మొదలుపెట్టారు. 

మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని సమాచారం. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. చరణ్ కి విలన్ గా ఎస్ జె సూర్య కనిపించనున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. 

RC16 కన్ఫర్మ్ అయినట్లేనా?
కొన్ని నెలలుగా చరణ్ ను కలిసి కథలు వినిపిస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలో కన్నడ దర్శకుడు నర్తన్ చెప్పిన కథ చరణ్ కి బాగా నచ్చిందట. 'మఫ్తి' అనే సినిమాతో కన్నడలో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు నర్తన్. చాలా కాలంగా ఆయన చరణ్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఫైనల్ గా కథ సెట్ అవ్వడంతో చరణ్ కి వినిపించారు. ఆయన ఓకే చెప్పడంతో.. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఫైనల్ నేరేషన్ ఇచ్చారు నర్తన్. కథ ఇంప్రెసివ్ గా అనిపించడంతో చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది.

News Reels

View this post on Instagram
 
A post shared by ABP Desam (@abpdesam)

Also Read: 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?

Also Read: 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్

Published at : 10 Oct 2022 03:03 PM (IST) Tags: Shankar Dil Raju RC15 Indian 2 Ram Charan

సంబంధిత కథనాలు

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

Varasudu Song : శింబుకు థాంక్స్ చెప్పిన 'వారసుడు' టీమ్ - థీ దళపతి

Varasudu Song : శింబుకు థాంక్స్ చెప్పిన 'వారసుడు' టీమ్ - థీ దళపతి

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.