Ram Charan 15: రాజమండ్రిలో ప్రజలకు రామ్ చరణ్ 15 ప్రొడక్షన్ హౌస్ స్వీట్ వార్నింగ్
రాజమండ్రిలో ప్రజలకు రామ్ చరణ్ 15 సినిమా నిర్మాతలు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకు? ఏమైంది? అంటే...

స్టార్ హీరోలతో అవుట్ డోర్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయడం దర్శక - నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది. షూటింగ్ చూడటం కోసం వచ్చే జనాలను కంట్రోల్ చేయడం ఒక ప్రాబ్లమ్ అయితే... షూటింగ్ చూడటంతో పాటు వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే జనాలతో మరింత ఇబ్బంది ఎదురవుతోంది. ఆన్ లొకేషన్ ఫొటోస్ లీక్ కావడంతో లుక్స్ బయటకు వచ్చేస్తున్నాయి. అందుకని, అటువంటి జనాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నారు. మెగా అభిమానులు, సాధారణ ప్రేక్షకులు పెద్ద ఎత్తున షూటింగ్ చూడటం కోసం వస్తున్నారు. కొంత మంది ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలా చేయవద్దని చిత్రనిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రిక్వెస్ట్ చేసింది. పోస్ట్ చేస్తే... సదరు సోషల్ మీడియా అకౌంట్స్ పట్ల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. రామ్ చరణ్ 15వ చిత్రమిది. ఇందులో హీరో సివిల్ సర్వెంట్ అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాకు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించారు.
Also Read: రామ్ చరణ్ - శంకర్ సినిమా కథ ఆ తమిళ దర్శకుడిదే!
రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 50వ చిత్రం ఇది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Also Read: తెలుగులో బప్పీ లహరి టాప్ 10 సాంగ్స్ లిస్ట్ ఇదే
View this post on Instagram
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















