By: ABP Desam | Updated at : 04 Apr 2022 04:05 PM (IST)
రామ్ చరణ్-శంకర్ సినిమా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి 'సర్కారోడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూణే, హైదరాబాద్, రాజమండ్రిలలో చిత్రీకరించారు.
దర్శకుడు శంకర్ సినిమా అంటే భారీతనం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ పాటను చిత్రీకరించారు. దానికోసం పది కొట్లాజు పైగా ఖర్చుపెట్టారు. అలానే పూణేలో ఓ ఫైట్ సీన్ ను చిత్రీకరించారు. దానికి కూడా పది కోట్లు ఖర్చు పెట్టారట. టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే శంకర్ తన సినిమాను ఎంతో గ్రాండియర్ గా రూపొందించేవారు. మరిప్పుడు ఊరుకుంటారా చెప్పండి. సినిమాలో పాటలు, ఫైట్స్ కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నారు శంకర్.
ఈ సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు నిర్మాత దిల్ రాజు. తన బ్యానర్ లో వస్తోన్న 50వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు గెటప్స్ లో కనిపిస్తారట. ఒకటి స్టూడెంట్ గెటప్ కాగా.. మరొకటి ప్రభుత్వ ఉద్యోగి అని తెలుస్తోంది. ప్రస్తుతం స్టూడెంట్ గెటప్ లో ఉండే కాలేజ్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరించడానికి అమృత్ సర్ ను లోకేషన్ గా ఎంచుకున్నారు. కొద్దిరోజుల్లోనే అక్కడ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.
శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ అంచనాతో ముందుకు వెళ్తున్నారు.
Also Read: నామినేషన్స్ హీట్ - అజయ్, అషులతో హమీద గొడవ
Also Read: రేవ్ పార్టీపై టాస్క్‌ఫోర్స్ దాడులు - బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్
Akira Nandan: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Upcoming Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోయే సినిమాలివే!
Pawan Kalyan: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!
Guppedantha Manasu మే 24(ఈరోజు) ఎపిసోడ్: వసుధారకు అసలు సంగతి చెప్పడానికి రెడీ అయిన రిషి- వెడ్డింగ్ డిజైన్ చేసిన మహేంద్ర
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి
Rajya Sabha Elections 2022: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, తెలంగాణలో రెండు స్థానాలకు ఎలక్షన్
Modi Hyderabad Tour: ఎల్లుండే హైదరాబాద్కు ప్రధాని మోదీ - ఈ పోస్టులు పెడితే నో ఎంట్రీ, కేసీఆర్ గైర్హాజరు!