'Ravanasura' Movie: రాక్షసులకి బాప్ 'రావణాసుర', రవితేజ కెరీర్లో మరో 'విక్రమార్కుడు' అయ్యేట్టుంది

క్రాక్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. వాటిలో సుధీర్ వర్మ దర్శకత్వంలో సైన్ చేసిన మూవీకి సంబంధించి అప్ డేట్ వచ్చింది.

FOLLOW US: 

రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీకి  'రావణాసుర' అనే టైటిల్ ను .. 'హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్' అనే ట్యాగ్ లైన్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అనుకున్నట్టుగానే  అదే టైటిల్ ఖరారు చేశారు. కొద్దిసేపటి క్రితమే టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. 

'రావణాసుర' ఫస్ట్ లుక్ సందర్భంగా డైరెక్టర్ సుధీర్ వర్మ ట్వీట్ చేస్తూ.. 'ఆంజనేయులు' కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పటి నుంచి రవితేజ తో వర్క్ చేయడం తన డ్రీమ్ అని ఇప్పుడు నిజమైందని అన్నారు. దీనికి కారణమైన శ్రీకాంత్ విస్సా, అభిషేక్ నామా, రవితేజకు కృతజ్ఞతలు అని సుధీర్ వర్మ ట్వీట్ చేశారు.
Also Read: ఆటలో ఆనీ మాస్టర్, ప్రియాంక సింగ్ విశ్వరూపం, షణ్ముక్ ని ఫేక్ అన్న సిరి
రవితేజ హీరోగా 70 వ సినిమా 'రావణాసుర'. 'హీరోలు ఉనికిలో లేరు.. కానీ రాక్షసులు ఉన్నారు.. 'రావణాసుర' రాక్షసులందరికీ బాప్'' అని చిత్ర బృందం పేర్కొంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రవితేజను పదిముఖాలతో రావణాసురుడిగా పరిచయం చేశారు.  సూటు బాటు వేసుకున్న రవితేజ , వెనుకున్న పది తొమ్మిది ముఖాలు, చేతిలో గన్స్, రక్తం కారుతున్న గొడ్డలిని చూపించారు. ఫస్ట్ లుక్ చూస్తుంటే మాస్ మహారాజ్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నట్టు తెలుస్తోంది. రవితేజ కెరీర్లో మరో విక్రమార్కుడు అవుతుందంటున్నారు అభిమానులు. అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై  అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే వెల్లడికానున్నాయి. 
Also Read: అయ్యోరింటి సుందరి... వయ్యారాల వల్లరి... నీలాంబరి!
Also Read: హీరో రాజ‌శేఖ‌ర్‌కు పితృ వియోగం... శనివారం చెన్నైలో అంత్యక్రియలు
Also Read: ‘మనీ హైస్ట్’ తెలుగు ట్రైలర్.. ప్రొఫెసర్ తన ముఠాను రక్షిస్తాడా? మరింత థ్రిల్‌గా దోపిడీ!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 05 Nov 2021 11:32 AM (IST) Tags: Ravi Teja First look sudheer varma 'Ravanasura'

సంబంధిత కథనాలు

Meena Husband Died: బ్రేకింగ్ న్యూస్ - హీరోయిన్ మీనా భర్త మృతి

Meena Husband Died: బ్రేకింగ్ న్యూస్ - హీరోయిన్ మీనా భర్త మృతి

Ranga Ranga Vaibhavanga: ఆర్జే కాజల్, మెహబూబ్‌తో జతకట్టిన వైష్ణవ్ తేజ్, కేతిక - కొత్తగా లేదేంటో!

Ranga Ranga Vaibhavanga: ఆర్జే కాజల్, మెహబూబ్‌తో జతకట్టిన వైష్ణవ్ తేజ్, కేతిక - కొత్తగా లేదేంటో!

Manasanamaha: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మన తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమః'!

Manasanamaha: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మన తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమః'!

Samrat Reddy: తండ్రి కాబోతున్న ‘బిగ్ బాస్’ సామ్రాట్

Samrat Reddy: తండ్రి కాబోతున్న ‘బిగ్ బాస్’ సామ్రాట్

Urfi Javed: వీడియో - అయ్యో, పువ్వు అనుకుని ఫోన్ పడేసిందే, పిచ్చి ముదిరితే ఇంతే!

Urfi Javed: వీడియో - అయ్యో, పువ్వు అనుకుని ఫోన్ పడేసిందే, పిచ్చి ముదిరితే ఇంతే!

టాప్ స్టోరీస్

Chiru In Modi Meeting : మోదీ, జగన్‌తో పాటు చిరంజీవి కూడా ! - నాలుగో తేదీన ఏపీలో

Chiru In Modi Meeting :  మోదీ, జగన్‌తో పాటు చిరంజీవి కూడా ! - నాలుగో తేదీన ఏపీలో

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

Horoscope 29th June 2022: ఈ రాశివారికి గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 29th June  2022:  ఈ రాశివారికి గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..

Janasena Janavani  :