By: ABP Desam | Updated at : 09 Feb 2023 01:27 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Amitabh bachchan/Instagram
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ఆయన ఇండస్ట్రీలో పనిచేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. ఎనిమిది పదుల వయసులోనూ అమితాబ్ వరుసగా సినిమాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. గతంలో ఆయన నటించిన సినిమాల్లో ‘దో ఔర్ దో పాంచ్’ సినిమా విడుదల అయి దాదాపు 43 ఏళ్లు అవుతున్న సందర్భంగా సోషల్ మీడియాలో సరదాగా ఓ పోస్ట్ చేశారాయన. అందులో అప్పట్లో జరిగిన ఓ సరదా సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ పోస్ట్ చూసి బిగ్ బి అభిమానులు తెగ సరదాపడిపోతున్నారట.
అమితాబ్ బచ్చన్ నటించిన ‘దో ఔర్ దో పాంచ్’ సినిమా 1980 లో విడుదల అయింది. కామెడీ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా వచ్చి 43 ఏళ్లు పూర్తవుతోన్న సందర్భంగా అమితాబ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ సరదా పోస్ట్ చేశారు. అందులో ఆయన ఇలా రాసుకొచ్చారు. 43 సంవత్సరాల 2 + 2 = 5 ‘దో ఔర్ దో పాంచ్’. ఈ సినిమా చాలా సరదాగా ఉంటుందని అన్నారు. అప్పట్లో బెల్ బాటమ్స్ ఫ్యాంట్ లను ఎక్కువగా వాడేవారని చెప్పుకొచ్చారు. అయితే ఓ సారి సినిమా చూడటానికి వెళ్లినపుడు తన బెల్ బాటమ్ ఫ్యాంట్ లో ఎలుక దూరిందని, బెల్ బాటమ్ ఫ్యాంట్ కు ధన్యవాదాలు అంటూ స్మైల్ ఎమోజీలను జత చేశారు. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ‘అప్పట్లో బెల్ బాటమ్ స్టైల్ లే వేరు, అందులో మీరు చాలా బాగుండేవారు’ అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. ఇంకొంత మంది ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్ అమితాబ్ ఈజ్ గ్రేట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది ‘అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సర్’ అంటూ ఫన్నీగా ప్రశ్నలు వేస్తున్నారు. ఇక ఈ ‘దో ఔర్ దో పాంచ్’ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీకు రాకేష్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శశి కపూర్, హేమ మాలిని, ప్రవీణ్ బాబి తదితరులు నటించారు.
అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే ‘ఉంచాయ్’ సినిమాలో మంచి హిట్ అందుకున్నారు అమితాబ్. ఈ సినిమా తర్వాత హీరో ప్రభాస్ నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు బిగ్ బి. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్వకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ మూవీలో దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ ఈ సినిమా కాకుండా మరికొన్ని ప్రాజెక్టుల్లో కూడా నటిస్తున్నారు.
Also Read: 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!
PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!
మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!
Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ
సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!
Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!