Rashmika: రష్మికకు మోకాళ్ల నొప్పులు - అసలు విషయం చెప్పేసిన డాక్టర్!
రష్మిక వయసు 26 ఏళ్లు మాత్రమే. ఈ వయసులో ఆమెకి మోకాళ్లు నొప్పులు రావడమేంటో..?
కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక(Rashmika).. 'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. దీంతో ఆమెకి పలు సినీ అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది. 'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ గా ఆమె పాపులర్ అయింది. ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి.
అయితే ఈ బ్యూటీ ఇప్పుడు మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతుందట. ఈ విషయాన్ని ఆమె డాక్టర్ స్వయంగా వెల్లడించారు. రష్మిక వయసు 26 ఏళ్లు మాత్రమే. ఈ వయసులో ఆమెకి మోకాళ్లు నొప్పులు రావడమేంటో..? తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ గురువారెడ్డిని కలిశారు. ఈ విషయాన్ని ఆయన చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
'నువ్వు 'సామి..సామి..' అంటూ మోకాళ్ల మీద బరువంతా వేసి డాన్స్ చెయ్యడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి!' అంటూ రష్మికను ఉద్దేశిస్తూ అన్నారు. 'పుష్ప' సినిమా చూసినప్పటి నుంచి రష్మికని కలిసి అభినందించాలనుకున్నానని.. ఆమె మోకాలి నొప్పి ద్వారా ఆ అవకాశం వచ్చిందంటూ రాసుకొచ్చారు. బన్నీ కూడా త్వరలోనే షోల్డర్ పెయిన్ తో తో వస్తాడు ఏమో అంటూ కామెడీగా రాసుకొచ్చారు.
ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు ఈ డాక్టర్ నే సంప్రదిస్తుంటారు. అలాంటిది ఆయన ఇలా ఒక హీరోయిన్ ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుందని బయటపెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని రష్మిక అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రష్మిక పర్మిషన్ తీసుకొనే పోస్ట్ పెట్టి ఉంటారని కొందరు అంటున్నారు.
ఇక రష్మిక కెరీర్ విషయానికొస్తే.. 'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో అమితాబ్ కూడా నటించారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే హిందీలో వరుస అవకాశాలు అందుకుంటుంది. అందులో సందీప్ రెడ్డి వంగ 'యానిమల్' సినిమా ఒకటి. రణబీర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటినుంచే మంచి బజ్ క్రియేట్ అయింది.
క్రేజీ సీక్వెల్ లో రష్మిక:
1990లో మహేష్ భట్ తీసిన 'ఆషికీ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా 2013లో 'ఆషికీ2' వచ్చింది. ఇందులో శ్రద్ధాకపూర్ నటించింది. ఈ సినిమా మరో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఫ్రాంచైజీలో భాగంగా 'ఆషికీ3' రాబోతుంది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక పేరుని పరిశీలిస్తున్నారు. ఆమెతో పాటు దీపికా పదుకోన్, అలియా భట్ ల పేర్లు కూడా లిస్ట్ లో ఉన్నాయి. మరి వీరిని దాటుకొని రష్మిక ఛాన్స్ అందుకుంటుందేమో చూడాలి.
Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ
Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జగనన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్