అన్వేషించండి

Rashmika Mandanna: డీప్ ఫేక్ వీడియో కేసు నిందితుడు అరెస్ట్, రష్మిక రియాక్షన్ ఇదే!

Rashmika Mandanna: తన డీప్ ఫేక్ వీడియో కేసుకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేయడం పట్ల రష్మిక మందన్న స్పందించింది. పోలీసులకు కృతజ్ఞతలు చెప్పింది.

Rashmika Mandanna Deepfake Video:  ప్రముఖ సినీ నటి రష్మిక మందన్నకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సృష్టించింది. పలువురు ప్రముఖులు ఈ వీడియోపై సీరియస్ అయ్యారు. ఇలాంటి వీడియోలను రూపొందించే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్  పోలీసు ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. ఈ డీప్‌ ఫేక్ వీడియో వెనుక ఉన్న కీలక నిందితుడిని తాజాగా అరెస్టు చేశారు.  ఏపీలోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్‌ (24) ను అదుపులోకి తీసుకున్నారు. అతడే ఈ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి షేర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుంచి ల్యాప్‌ టాప్‌, మొబైల్‌ స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు తెలిపారు. డిలీట్‌ చేసిన డేటాను రికవరీ చేసేందుకు ట్రై చేస్తున్నట్లు వెల్లడించారు. రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్ పేజీని రన్ చేసిన ఆయన,  ఫాలోవర్స్ సంఖ్య పెంచుకునేందుకు ఈ వీడియోను తయారు చేసినట్లు తెలిపారు. రష్మికతో పాటు మరో ఇద్దరు సెలబ్రిటీల ఫ్యాన్ పేజీలను కూడా నవీన్ నడిపినట్లు గుర్తించామన్నారు.

పోలీసులకు థ్యాంక్స్ చెప్పిన రష్మిక

అటు డీప్‌ ఫేక్‌ వీడియో కేసు నిందితుడిని  పోలీసులు అరెస్టు చేయడం పట్ల రష్మిక మందన్న స్పందించింది. పోలీసులకు థ్యాంక్స్ చెప్పింది. మార్ఫింగ్ వీడియోలు, ఫోటోల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె యువతకు సూచించింది. “డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులకు ధన్యవాదాలు. ఈ ఘటన పట్ల నాకు అండగా నిలవడంతో పాటు మద్దతు ప్రకటించిన వారందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి పనులకు పాల్పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని యువత గుర్తించాలి. అనుమతి లేకండా ఎవరి ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసినా నేరమే అవుతుంది” అని రష్మిక అభిప్రాయపడింది.    

గత నవంబర్ లో బయటకు వచ్చిన రష్మిక డీప్ ఫేక్ వీడియో

గత ఏడాది  నవంబర్ లో రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. బ్రిటీష్- ఇండియన్ ఇన్ ప్ల్యూయెన్సర్ జరా పటేల్ బాడీకి రష్మిక ముఖాన్ని పెట్టి డీప్ ఫేక్ వీడియోను రూపొందించారు. ఈ వీడియో బాగా వైరల్ కావడంతో  పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందని రష్మిక సైతం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్‌ సైతం సీరియస్ అయ్యింది.   నిందితుడు రష్మిక ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను, సెక్షన్ 465, 469 కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది నవంబరు 10న కేసు నమోదు కాగా, ఇప్పటికే ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

Read Also: రామ్ లల్లా విగ్రహం అచ్చం అలాగే ఉంది, కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget