Rashmika on Pushpa: సామి సామి... ఇంత ప్రేమ ఏంది సామి... రష్మిక గ్రాటిట్యూడ్!
'పుష్ప' సినిమాలో 'సామి సామి' వస్తున్న స్పందన చూస్తుంటే... తన మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోతోందని రష్మిక తెలిపారు.
'పుష్ప: ద రైజ్' సినిమా చాలా మందికి నచ్చింది. పుష్పరాజ్‌గా నటించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించిన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా ప్రేక్షకులకు నచ్చారు. సినిమా థియేటర్లలో విడుదల అయినప్పుడు ఎంతో మంది చూశారు. ఆ తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడు కొంత మంది మళ్లీ చూశారు. చూడనివాళ్లు ఓటీటీలో చూశారు. సినిమాతో పాటు అందులో పాటలు కూడా హిట్టే. రష్మిక డాన్స్ చేసిన పెప్పీ నంబర్ 'సామి సామి' పాటకు చాలా మంది రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
'సామి సామి...' పాటకు వస్తున్న చూస్తుంటే తన మనసంతా సంతోషంతో ఉప్పొంగి పోతోందని రష్మికా మందన్నా సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ "ఈ పాటను పెద్ద హిట్ చేసిన, అందులో నన్ను ఇష్టపడిన నా అభిమానులు అందరికీ థాంక్స్. ఈ స్పందన చూస్తుంటే... పాటలో బెస్ట్ ఇవ్వడానికి గంటలు గంటలు నేను చేసిన రిహార్సిల్స్ గుర్తుకు వస్తున్నాయి. 'సామి సామి' హుక్ స్టెప్ వేస్తూ ఎంతో మంది సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. అవి చూస్తుంటే షూటింగ్ డేస్ గుర్తుకు వచ్చాయి. ప్రజల ప్రేమ ఈ పాటను మరింత స్పెషల్ చేసింది. ఎప్పటికీ గుర్తుండిపోయేలా మార్చింది" అని చెప్పారు. అడవుల్లో పుష్ప షూటింగ్ చేయడం కోసం చాలా కష్టపడ్డామని ఆమె తెలిపారు.
'పుష్ప'కు ఉత్తరాదిలో కూడా చక్కటి ఆదరణ లభించింది. ఈ సినిమా విజయం ప్రేక్షకుల్లో భాషా, సంప్రదాయపరమైన సరిహద్దులను చెరిపేసిందని రష్మిక చెప్పారు. త్వరలో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' సినిమాలతో రష్మిక హిందీ చలన చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్న సంగతి తెలిసిందే. హిందీలో తన తొలి సినిమా 'మిషన్ మజ్ను' తనకు ఎంతో స్పెషల్ అని ఆమె అన్నారు.
View this post on Instagram