News
News
X

Rashmika Look From Varisu : రంజితమే - రష్మిక ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే లుక్!

తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ జోడీగా రష్మిక నటిస్తున్న సినిమా 'వారసుడు'. ఈ రోజు విడుదలైన సాంగ్ స్టిల్‌లో ఆమె లుక్ రివీల్ చేశారు.

FOLLOW US: 

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) కథానాయకుడిగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమా 'వారసుడు' (Varasudu Movie). తమిళ సినిమా 'వారిసు' (Varisu) కు తెలుగు అనువాదం ఇది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆమె లుక్ విడుదల చేశారు.

Rashmika Look From Ranjithame : సంక్రాంతి కానుకగా 'వారసుడు' సినిమాను విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ విజయ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ రోజు సాయంత్రం ఫస్ట్ సాంగ్ 'రంజితమే' (Ranjithame Lyrical Video) కూడా విడుదల చేస్తున్నారు. అయితే... ఇప్పటి వరకు రష్మిక ఫస్ట్ లుక్ విడుదల చేయలేదు. వర్కింగ్ స్టిల్స్‌లో ఆమె కనిపించడం తప్ప... సరైన స్టిల్ రాలేదు. ఇప్పుడు 'రంజితమే' సాంగ్ విడుదల సందర్భంగా ఓ స్టిల్ పోస్ట్ చేశారు. అందులో రష్మిక లుక్ ఆమె ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిందని చెప్పాలి.  

'వారసుడు' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. లేటెస్ట్ టాక్ ఏంటంటే... విడుదలకు ముందే 'దిల్' రాజుకు 30 కోట్ల రూపాయలు లాభం వచ్చిందట! 

View this post on Instagram
 
A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

News Reels

తమిళనాట విజయ్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆయన సినిమాలు మినిమమ్ వంద కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. అందుకని, 'వారసుడు' తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియో రూ. 72 కోట్ల నుంచి రూ. 75 కోట్ల మధ్య సొంతం చేసుకుందట. ఓవర్సీస్ రిలీజ్ రైట్స్‌ను రూ. 38 కోట్లకు ఫార్స్ ఫిలిమ్స్ సొంతం చేసుకుందని సమాచారం. డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయ్యిందని... తెలుగు, తమిళ భాషల హక్కులను సుమారు 150 కోట్లకు అటు ఇటుగా అమ్మేశారని టాక్. ఆడియో రైట్స్ టీ సిరీస్ తీసుకుంది. ఐదు కోట్లకు ఆ డీల్ కుదిరిందని బాలీవుడ్ టాక్.

తెలుగు థియేట్రికల్ రైట్స్ కాకుండా 'వారసుడు' మిగతా రైట్స్ అన్నీ కలిపి సుమారు 280 కోట్లకు ఇచ్చేశారట. సినిమా నిర్మాణానికి సుమారు 250 కోట్లు అవుతోందని వినబడుతోంది. ఆ లెక్కన విజయ్ సినిమాతో 'దిల్' రాజుకు 30 కోట్లు లాభమే. అది కాకుండా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి. ఎటు చూసినా దిల్ రాజు మంచి ప్రాఫిట్స్ అందుకుంటున్నారని ట్రేడ్ వర్గాల టాక్. 

Also Read : రజనీకాంత్ 'లాల్ సలామ్' - అమ్మాయి దర్శకత్వంలో...
 
ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు 'వారసుడు'లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినెమాటోగ్రఫీ: కార్తీక్ పళని కూర్పు: కె.ఎల్. ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత.

Published at : 05 Nov 2022 11:40 AM (IST) Tags: Rashmika Look From Varisu Rashmika First Look Varasudu Vijay Varisu Update Ranjithame Lyrical Video Ranjithame Song Varisu

సంబంధిత కథనాలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

టాప్ స్టోరీస్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి