అన్వేషించండి

Lal Salaam Movie : రజనీకాంత్ 'లాల్ సలామ్' - అమ్మాయి దర్శకత్వంలో...

కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రజనీకాంత్ నటించనున్నారు. ఆయన కొత్త సినిమా వివరాలు నేడు వెల్లడించారు. అయితే... అందులో ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసుకోండి మరి!

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కొత్త సినిమా 'లాల్ సలామ్' (Lal Salaam Movie) నేడు ప్రకటించారు. ఈ చిత్రానికి  ఆయన కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకురాలు. అయితే... ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ సినిమాలో రజనీ హీరో కాదు... ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఆయనది స్పెషల్ అప్పియరెన్స్ మాత్రమేనని చిత్ర బృందం వెల్లడించింది. మరి, హీరోలు ఎవరంటే... 

ఇద్దరు హీరోలతో సౌందర్య సినిమా!
విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ సంతోష్ (Vikranth Santhosh) హీరోలుగా 'లాల్ సలామ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఐశ్వర్యా రజనీకాంత్. ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. నేడు సినిమాను అధికారికంగా ప్రకటించారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తే... క్రికెట్ నేపథ్యంలో రూపొందిస్తోన్న యాక్షన్ డ్రామాలా ఉంది. ఆ  మంటలు గట్రా చూస్తుంటే... క్రికెట్ కాస్త ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీసినట్టు ఉంది. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయనున్నట్టు పోస్టర్ లో పేర్కొన్నారు.  

ఐశ్వర్యకు హిట్ వచ్చేనా?
దర్శకురాలిగా ఐశ్వర్యకు నాలుగో చిత్రమిది. దీంతో అయినా హిట్ వస్తుందో? లేదో? చూడాలి. ఎందుకంటే... ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన '3' సినిమాతో ఆవిడ మెగాఫోన్ పట్టుకున్నారు. దర్శకురాలిగా తొలి సినిమా సక్సెస్ కాలేదు. కానీ, అందులో 'వై థిస్ కొలవెరి డి' సూపర్ హిట్ అయ్యింది. అనిరుధ్ రవిచంద్రన్ ఆ తర్వాత స్టార్ అయ్యారు. '3' తీశాక... మరో సినిమా 'వై రాజా వై', డాక్యుమెంటరీ 'సినిమా వీరన్' తీశారు. ఆ రెండు కూడా హిట్ కాలేదు. కిప్పుడు ఏకంగా తండ్రి రజనిని ప్రత్యేక పాత్రలో పెట్టి సినిమా తీస్తున్నారు.
 
కుమార్తె కోసం తప్పలేదా?
అమ్మాయి కోసం రజనీకాంత్ ఈ సినిమా చేస్తున్నారని చెన్నై టాక్. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కూడా రజని కోసం సినిమా చేయడానికి ముందుకు వచ్చారని అంటున్నారు. గతంలో చిన్న కుమార్తె సౌందర్య 'కొచ్చడయాన్' అంటూ రజనీకాంత్‌తో యానిమేషన్ సినిమా తీశారు. అప్పుడు ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఐశ్వర్య ఏం చేస్తారో? 

Also Read : విజయ్ దేవరకొండను ఖాళీగా కూర్చోబెట్టిన సమంత?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lyca Productions (@lyca_productions)


ఆ మధ్య ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ఒక మ్యూజిక్ వీడియో రూపొందించారు ఐశ్వర్య రజనీకాంత్. దానికి ఆవిడ దర్శకత్వం వహించారు. 'సంచారి...' అంటూ సాగిన ఆ గీతానికి అంకిత్ తివారి సంగీతం అందించారు. దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఆలపించారు. 

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా విషయానికి వస్తే... 'కొలమావు కోకిల', 'వరుణ్ డాక్టర్', 'మాస్టర్' తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' చేస్తున్నారు. అందులో శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు ప్రధాన తారాగణం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
Andhra Pradesh Latest News: 1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
Donald Trump Tariffs: సుంకాల విధింపు 3 నెలలు వాయిదా- టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన అమెరికా- చైనాకు దక్కని ఊరట
సుంకాల విధింపు 3 నెలలు వాయిదా- టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన అమెరికా- చైనాకు దక్కని ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటేDevon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
Andhra Pradesh Latest News: 1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
Donald Trump Tariffs: సుంకాల విధింపు 3 నెలలు వాయిదా- టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన అమెరికా- చైనాకు దక్కని ఊరట
సుంకాల విధింపు 3 నెలలు వాయిదా- టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన అమెరికా- చైనాకు దక్కని ఊరట
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Tahawwur rana: కసబ్ బాబు లాంటి టెర్రరిస్టును అమెరికా నుంచి లాక్కొస్తున్నారు -తహవూర్ రాణాకు ఉరి శిక్ష విధిస్తారా ?
కసబ్ బాబు లాంటి టెర్రరిస్టును అమెరికా నుంచి లాక్కొస్తున్నారు -తహవూర్ రాణాకు ఉరి శిక్ష విధిస్తారా ?
Pant Fake Fielding:  పంత్ ఫేక్ ఫీల్డింగ్..! కేకేఆర్ ను బోల్తా కొట్టించాడా..?  సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌ 
పంత్ ఫేక్ ఫీల్డింగ్..! కేకేఆర్ ను బోల్తా కొట్టించాడా..?  సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌ 
Embed widget