By: ABP Desam | Updated at : 05 Nov 2022 08:00 AM (IST)
రష్మీ గౌతమ్ (ఇన్సెర్ట్లో... కొత్త యాంకర్)
ఖతర్నాక్ కామెడీ షో 'జబర్దస్త్' (Jabardasth) కు మళ్ళీ కొత్త యాంకర్ వచ్చారు. రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ను తీసేసి... ప్రతి గురువారం వచ్చే ప్రోగ్రామ్ కోసం ఆ సోఫాలో మరో అందాల భామను కూర్చోబెట్టారు. దాంతో రష్మీ లేటెస్ట్ 'జబర్దస్త్' జర్నీ నాలుగు నెలల్లో ముగిసింది. అసలు వివరాల్లోకి వెళితే...
వెండితెర రంగమ్మత్త, బుల్లితెర అందాల భామ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) 'జబర్దస్త్'కు వీడ్కోలు పలికిన తర్వాత ఆమె ప్లేసులోకి మల్లెమాల సంస్థ ఎవరిని తీసుకొస్తుంది? అని చాలా మంది ఎదురు చూశారు. అప్పుడు ఊరించి ఊరించి 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు యాంకరింగ్ చేస్తున్న రష్మీ గౌతమ్ చేతిలో గురువారం వచ్చే 'జబర్దస్త్' షో కూడా పెట్టారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... 'జబర్దస్త్' నుంచి రమ్మీని తీసేశారు. ఆమె ప్లేసులో కొత్త యాంకర్‌ను తెచ్చారు.
'శ్రీమంతుడు' నుంచి 'జబర్దస్త్'కు...
Sowmya Rao - Jabardasth Anchor : ఈటీవీలో ప్రసారం అవుతున్న 'శ్రీమంతుడు' సీరియల్ ఉంది కదా! అందులో సౌమ్య రావు (Sowmya Rao) అని ఆర్టిస్ట్ ఉన్నారు కదా! ఆవిడను 'జబర్దస్త్'కు తీసుకు వచ్చారు. నవంబర్ 10 నుంచి టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్స్‌కు ఆవిడ యాంకరింగ్ చేయనున్నారు. లేటెస్టుగా 'జబర్దస్త్' కొత్త ప్రోమో విడుదల అయ్యింది. అందులో సౌమ్య రావును కొత్త యాంకర్‌గా ఇంద్రజ పరిచయం చేశారు.
సౌమ్య కంటే ఆది హైట్ తక్కువ!
'జబర్దస్త్' కొత్త యాంకర్ సౌమ్య రావు (Sowmya Rao) తో 'హైపర్' ఆది (Hyper Aadi) లవ్ ట్రాక్ లాంటిది స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని కొత్త ప్రోమో చూస్తే తెలుస్తోంది. అయితే... తన కంటే ఆది హైట్ తక్కువ అన్నట్టు సైగల ద్వారా సౌమ్య చూపించారు. ''సౌమ్య గారు... చాలా అందంగా ఉన్నారు మీరు. మీ రాకతో 'జబర్దస్త్' వేరే లెవల్. ఆది అన్నకు కరెక్ట్ జోడి. ఆల్ ది బెస్ట్ సౌమ్య గారు'' అని ఒకరు కామెంట్ చేశారు.
'జబర్దస్త్'కు సౌమ్య రావును తీసుకు వచ్చినా... 'ఎక్స్ట్రా జబర్దస్త్' ఎపిసోడ్‌కి మాత్రం రష్మీని కంటిన్యూ చేశారు. ప్రోమో విడుదల అయ్యిందో? లేదో? సౌమ్య రావు ఫ్యాన్స్ కామెంట్స్ స్టార్ట్ చేశారు. ''సౌమ్య సెలక్షన్ సూపర్'' అని కొందరు కామెంట్స్ చేశారు. ఆవిడను కంటిన్యూ చేయాలని మరికొందరు కోరుతున్నారు.
Also Read : 'ఊర్వశివో రాక్షసివో' రివ్యూ : ఆరు ముద్దులు, ఆ తర్వాత అర్థమైందిగా - అల్లు శిరీష్ సినిమా ఎలా ఉందంటే?
సినిమాల్లో రష్మీ బిజీ అవుతారా?
'జబర్దస్త్' నుంచి రష్మీని ఎందుకు తీసేశారు? అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అవుతోంది. కథానాయికగా ఆవిడ నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ఈ వారం విడుదల అయ్యింది. మళ్ళీ సినిమా అవకాశాలు వస్తున్నాయట. ప్రస్తుతం 'ఎక్స్ట్రా జబర్దస్త్'తో పాటు 'శ్రీ దేవి డ్రామా కంపెనీ'కి కూడా రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తున్నారు. టీవీ షోస్ ఎక్కువ అయితే సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడం ఇబ్బంది అవుతుందేమోనని ముందు జాగ్రత్త పడుతున్నారని టాక్.
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్ - శోభాశెట్టి చీటింగ్ గేమ్, శివాజీ ఫ్రస్ట్రేషన్
Bigg Boss: ‘బిగ్ బాస్’ విన్నర్‌పై ఆరోపణలు, ట్రోఫీ తిరిగి ఇచ్చేస్తానంటూ వీడియో
Samantha: అప్పుడలా, ఇప్పుడిలా - గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సమంత, ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Ram Charan: కొత్త ఫ్రెండ్‌తో రామ్ చరణ్ ఫోటో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
Hyderabad Crime: ప్రేమ కథ విషాదాంతం - ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య
/body>