Urvasivo Rakshasivo Review - 'ఊర్వశివో రాక్షసివో' రివ్యూ : ఆరు ముద్దులు, ఆ తర్వాత అర్థమైందిగా - అల్లు శిరీష్ సినిమా ఎలా ఉందంటే?
Urvasivo Rakshasivo Movie Review : 'ఊర్వశివో రాక్షసివో' ప్రచార చిత్రాలు చూస్తే న్యూ ఏజ్ రొమాంటిక్ సినిమా అనే ఫీలింగ్ కలిగించాయి. మరి, సినిమా ఎలా ఉందో రివ్యూ చదివి తెలుసుకోండి.
రాకేశ్ శశి
అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, 'వెన్నెల' కిశోర్ తదితరులు
సినిమా రివ్యూ : ఊర్వశివో రాక్షసివో
రేటింగ్ : 2.75/5
నటీనటులు : అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, 'వెన్నెల' కిశోర్, ఆమని, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిల్లా, కేదార్ శంకర్ తదితరులు
కథ : ఎలాన్
ఛాయాగ్రహణం : తన్వీర్
పాటలు, నేపథ్య సంగీతం: అచ్చు రాజమణి (మాయారే సాంగ్ : అనూప్ రూబెన్స్)
సమర్పణ : అల్లు అరవింద్
నిర్మాతలు : తమ్మారెడ్డి భరద్వాజ, ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : రాకేశ్ శశి
విడుదల తేదీ: నవంబర్ 4, 2022
అల్లు శిరీష్ (Allu Sirish) మూడేళ్ళ విరామం తర్వాత... రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ఊర్వశివో రాక్షసివో' (Urvasivo Rakshasivo Movie) సినిమాతో నేడు థియేటర్లలోకి వచ్చారు. అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా ఎలా ఉంది (Urvasivo Rakshasivo)? 'జత కలిసే', 'విజేత' సినిమాలతో సాలిడ్ సక్సెస్ అందుకోలేకపోయిన దర్శకుడు రాకేష్ శశి, 'ఊర్వశివో రాక్షసివో'తో సక్సెస్ అందుకునే అవకాశాలు ఉన్నాయా? అల్లు శిరీష్ కోరుకున్న సక్సెస్ లభించేనా?
కథ (Urvasivo Rakshasivo Story) : శ్రీ కుమార్ (అల్లు శిరీష్) మిడిల్ క్లాస్ యువకుడు. ఆఫీసులో కొత్తగా చేరిన సింధూజ (అనూ ఇమ్మాన్యుయేల్) తో ప్రేమలో పడతాడు. ఆమె అమెరికాలో చదువుకుని ఇండియా వచ్చిన అమ్మాయి. మోడ్రన్ గాళ్. ఆమెకు పెళ్లి అంటే ఇష్టం లేదు. అందుకని, తన ఇంటికి రెండు వీధుల అవతల ఇల్లు అద్దెకు తీసుకుని సహ జీవనం స్టార్ట్ చేస్తాడు శ్రీ కుమార్. ఇంట్లో తల్లిదండ్రులు (ఆమని, కేదార్ శంకర్)కు ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయడం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు? అబ్బాయికి పెళ్ళి చేయడమే లక్ష్యంగా బతుకుతున్న తల్లి ఆస్పత్రి పాలైన తర్వాత శ్రీ కుమార్ ఏం చేశాడు? తల్లి కోసం పెళ్లి చేసుకున్నాడా? లేదంటే ప్రేమతో సహ జీవనం చేస్తున్న అమ్మాయి కోసం దాన్ని కంటిన్యూ చేశాడా? అసలు, శ్రీ కుమార్ తప్పిపోయాడదని తల్లిదండ్రులు ఎందుకు కంప్లైంట్ చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Urvasivo Rakshasivo Telugu Review) : 'ఊర్వశివో రాక్షసివో' ట్రైలర్ చూస్తే... సినిమా ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది. అందుకు తగ్గ కంటెంట్ సినిమాలో ఉంది. ఆరు ముద్దులు, మూడు బెడ్ రూమ్ సీన్స్ అన్నట్టు హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమను స్క్రీన్ మీదకు తీసుకు వచ్చారు. ఇప్పుడు అందరూ ఇలాగే ఉంటున్నారని చెప్పలేం. కానీ, ఒక సెక్షన్ ఆఫ్ ప్రజెంట్ జనరేషన్ లివింగ్ లైఫ్‌ను చూపించారు.
'ఊర్వశివో రాక్షసివో' కథ విషయానికి వస్తే... కొత్తగా చెప్పింది ఏమీ లేదు. పోనీ, కథలో కాన్‌ఫ్లిక్ట్ కొత్తగా ఉందా? అంటే అదీ లేదు. మరి, ఏం ఉంది? అంటే... కామెడీ! అవును... సినిమాలో ఫన్ ఉంది. హీరోకి ఎదురయ్యే సందర్భాల నుంచి కామెడీ క్రియేట్ చేశారు. కొన్ని డైలాగుల్లో డబుల్ మీనింగ్ ఉంది. యూత్, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్, కామెడీ ఆకట్టుకుంటాయి. వాటిని పక్కన పెడితే... ఎమోషన్స్‌తో కనెక్ట్ కాలేం. హీరోయిన్ ఎందుకు పెళ్లి వద్దంటోంది? అనేది ఆడియన్స్‌కు అర్థమయ్యేలా చూపించలేదు. హీరో అండ్ మదర్ మధ్య బాండింగ్ ఇంకా ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది.
సినిమాకు పాటలు ప్లస్. వినడానికి బావున్నాయి. పిక్చరైజేషన్ కలర్‌ఫుల్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. అచ్చు రాజమణి మళ్ళీ తెలుగులో బిజీ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. దర్శకుడు రాకేష్ శశి యూత్‌ను టార్గెట్ చేస్తూ సినిమా చేశారు. అందువల్ల, ఎమోషన్స్‌తో పాటు మిగతా విషయాలపై పెద్దగా దృష్టి పెట్టలేదేమో!
నటీనటులు ఎలా చేశారు? : అల్లు శిరీష్ నటనలో ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది. అలాగే, కామెడీ టైమింగ్‌లో కూడా! మోడ్రన్ గాళ్‌గా హీరోయిన్ క్యారెక్టర్‌కు అనూ ఇమ్మాన్యుయేల్ గ్లామర్ హెల్ప్ అయ్యింది. ఎమోషనల్ సీన్స్‌లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సునీల్, 'వెన్నెల' కిశోర్, పోసాని కృష్ణమురళికి మంచి కామెడీ సీన్స్ పడ్డాయి. టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు కావడంతో మంచి ఫన్ జనరేట్ చేశారు. తల్లిగా ఆమని మరోసారి కంటతడి పెట్టిస్తారు. పృథ్వీ సహా మిగతా ఆరిస్టులు క్యారెక్టర్లకు తగ్గట్టు నటించారు.
Also Read : 'తగ్గేదే లే' రివ్యూ : 'దండుపాళ్యం' గ్యాంగ్ తగ్గారా? లేదంటే మళ్ళీ మొదలు పెట్టారా?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'ఊర్వశివో రాక్షసివో' యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్! మోడ్రన్ రిలేషన్షిప్స్ బేస్ చేసుకుని తీసిన ఓ సింపుల్ సినిమా. కొత్త కథ లేదు. కానీ, రొమాన్స్ అండ్ కామెడీ బావుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, లిప్ లాక్స్‌ను క్యాజువల్‌గా చూపించారు. అందువల్ల, ఫ్యామిలీతో చూడాలంటే కొంచెం ఇబ్బంది పడాలి. కపుల్స్ అండ్ ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.
Also Read : 'బనారస్' రివ్యూ : ఒక్క టికెట్టుపై రెండు సినిమాలు - ప్రేమకథలో సర్‌ప్రైజింగ్ ట్విస్ట్!