By: ABP Desam | Updated at : 22 Apr 2023 02:06 PM (IST)
Photo@Aliabhatt/instagram
బాలీవుడ్ దర్శక, నిర్మాత ఆదిత్య చోప్రా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి పమేలా చోప్రా తాజాగా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఆయన తల్లి మృతి పట్ల సంతాపం తెలపడంతో పాటు సానుభూతి ప్రకటిస్తున్నారు. అందరి లాగే బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ సైతం ఆదిత్య చోప్రా ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లోకి వెళ్లే సమయంలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆదిత్య ఇంటి దగ్గర ఏం జరిగిందంటే?
శుక్రవారం రాత్రి సమయంలో ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ ఆదిత్యా చోప్రాను పరామర్శించడానికి వెళ్లారు. క్యాజువల్ వేర్ లో వీరిద్దరు అక్కడికి వెళ్లారు. ఆలియా ఇంట్లోకి వెళ్తూ గుమ్మం ముందే చెప్పులు విడిస్తుంది. వెనుకే వచ్చిన రణ్ బీర్ గడప ముందు చెప్పులు ఉండటం మంచిది కాదని భావించి, వాటిని తన చేతితో తీసుకుని గుమ్మం పక్కన పెడతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చాలా మంది రణ్ బీర్ చెప్పులు తీయడం పట్ల పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. “రణ్ బీర్ కు పెద్దలంటే గౌవరం చాలా ఎక్కువ. అందుకే సినీ ప్రముఖులు ఎవరు చనిపోయినా తను తప్పకుండా హాజరై సంతాపం తెలిపుతారు” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “ఆలియాకు రణ్ బీర్ లాంటి భర్త దొరకడం ఆమె చేసుకున్న అదృష్టం అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. గుమ్మానికి ఎదురగా ఉన్న చెప్పులు తీయడాన్ని అభినందిస్తున్నారు. మరికొంత మంది మాత్రం నెగెటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఆదిత్య చోప్రాను పరామర్శించి అక్కడి నుంచి వెళ్లిపోయారు రణ్ బీర్ దంపతులు. గుమ్మం బయటకు వచ్చి ఆలియా, రణ్ బీర్ దంపతులను పంపించి వెళ్తారు ఆదిత్య .
2022లో పెళ్లి చేసుకున్న అలియా, రణ్ బీర్
అటు అలియా భట్, రణ్ బీర్ కపూర్ కొంత కాలం డేటింగ్ చేశారు. ఏప్రిల్ 14, 2022 నాడు ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకలో కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లయిన రెండు నెలలకే తాము పేరెంట్స్ కాబోతున్నామని ఆలియా, రణ్ బీర్ ప్రకటించారు. నవంబర్ 2022లో వీరికి అమ్మాయి జన్మించింది. ఇక వీరిద్దరు కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ 9న విడుదల అయ్యింది. దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది.
Read Also: 'జో బిడెన్ - దలైలామా' ముద్దులు, క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్
Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్
Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్
Gufi Paintal Hospitalized : ఆస్పత్రిలో గుఫీ పెయింటల్ - విషమంగా 'మహాభారత్'లో శకుని ఆరోగ్య పరిస్థితి
Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు
Adivi Sesh - Major's 1st Anniversary: భుజం నొప్పి ఉన్నా అమ్మ వంట చేసి పెట్టింది, మహేష్ బాబుకు థాంక్స్: అడవి శేష్
Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?
Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!
Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం
YS Viveka Case : సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి - అరెస్ట్ భయం లేనట్లే !