News
News
వీడియోలు ఆటలు
X

Kangana Ranaut : 'జో బిడెన్ - దలైలామా' ముద్దులు, క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్

జో బిడెన్-దలైలామాపై జోక్ వ్యవహారంలో కంగనా రనౌత్ ఓమాపణలు చెప్పారు. తాను బుద్దుడి బోధనలు నమ్ముతానని, ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వారి ఫోటోను షేర్ చేయలేదని చెప్పుకొచ్చారు.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా షేర్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు తీవ్ర సంచలనం కలిగించింది. బౌద్ధ బిక్షువులు ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా కలిసి కంగనా కార్యాలయం ముందు ఎర్రటి ఎండలో ఆందోళన చేశారు. వెంటనే స్పందించిన కంగనా, క్షమాపణలు చెప్పారు. తాను తప్పుడు ఉద్దేశంతో ఆ పోస్టు పెట్టలేదని, కేవలం జోక్ గానే షేర్ చేశానని వివరణ ఇచ్చారు.

ఇంతకీ కంగనా పెట్టిన పోస్టులో ఏముంది?

బౌద్ధ మత గురువు దలైలామా తాజాగా అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆదేశ అధ్యక్షుడు జో బిడెన్ ను వైట్ హౌజ్ లో కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోల్లో ఒక దానిని కంగనా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో దలైలామా- బిడెన్ ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఉంది. అంతేకాదు, దీనికి "వైట్ హౌస్ లో దలైలామాకు ఘన స్వాగతం" అనే క్యాప్షన్‌ పెట్టారు కంగనా. "దోనో కో సేమ్ బిమారీ హై, డెఫినెట్లీ దోనో కి దోస్తీ హో శక్తి హై (ఇద్దరికీ ఒకే రోగంఉంది, ఇద్దరూ కచ్చితంగా స్నేహితులు కావచ్చు)" అంటూ రాసుకొచ్చింది.

క్షమాపణలు చెప్పిన కంగనా రనౌత్

కంగనా సోషల్ మీడియా పోస్టు పట్ల కొంతమంది బౌద్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా కార్యాలయం వెలుపల నిరసనలు చేపట్టారు. వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనపై కంగనా స్పందించారు. తన జోక్ పట్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరారు.  నా కార్యాలయం బయట కొంతమంది  బౌద్ధుల సమూహం ఆందోళన చేస్తోంది. నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. బిడెన్ దలైలామాతో స్నేహం చేయడం గురించి మాత్రమే జోక్ చేశాను. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి” అని చెప్పారు. దీనికి చేతులు ముడుచుకున్న ఎమోజీని యాడ్ చేశారు. "నేను బుద్ధుని బోధనలను నమ్ముతాను. దలైలామా తన జీవితమంతా ప్రజాసేవలో గడిపారు. నేను ఎవరికీ వ్యతిరేకంగా ఏమీ చేయను. తీవ్రమైన వేడిలో నిలబడకండి.  దయచేసి ఇంటికి వెళ్లండి" అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.  

బాలుడితో దలైలామా అనుచిత ప్రవర్తన

గత కొద్ది రోజుల క్రితం బాలుడి పట్ల అనుచితంగా ప్రవర్తించి తీవ్ర విమర్శలపాలయ్యారు బౌద్ధమత గురువు దలైలామా. ఆ తర్వాత బాలుడితో పాటు ఆయన కుటుంబానికి క్షమాపణలు చెప్పారు.  రీసెంట్ గా దలైలామా దగ్గరికి వెళ్లిన ఓ బాలుడు  మిమ్మల్ని హగ్‌ చేసుకోవాలని ఉందడని అడిగాడు.  ఆ సమయంలో బాలుడి పెదాలపై దలైలామా ముద్దు పెట్టడంతోపాటు తన నాలుకను నోటితో తాకాలని బాలుడినికి సూచించాడు. ఈ వీడియో క్లిప్ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. నెటిజన్లు దలౌలామా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  వెంటనే, ఈ విషయంపై స్పందించిన దలైలామా, ఆ బాలుడికి, అతడి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు.   

‘ఎమర్జెన్సీ’ పనుల్లో కంగనా బిజీ

అటు కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రను ఆమె  పోషిస్తున్నారు. తన మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్‌లో కంగనా స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు.  ఈ చిత్రంలో మిలింద్ సోమన్, అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, దివంగత నటుడు సతీష్ కౌశిక్ తదితరులు నటించారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.  ‘చంద్రముఖి 2’లోనూ కంగనా నటిస్తున్నారు.

Read Also: అల్లరి నరేష్ నట విశ్వరూపం, ‘ఉగ్రం’ ట్రైలర్‌ లో ఉగ్రరూపం చూపించేశారుగా!

Published at : 22 Apr 2023 11:32 AM (IST) Tags: Kangana Ranaut Kangana Ranaut Apologize Biden-Dalai Lama joke Buddhists Protest

సంబంధిత కథనాలు

NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్ 

NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్ 

మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్

మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్

Samantha Workout Video : షాక్ ఇచ్చిన సమంత - వందకు తగ్గేదే లే!

Samantha Workout Video : షాక్ ఇచ్చిన సమంత - వందకు తగ్గేదే లే!

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్

Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్

టాప్ స్టోరీస్

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?