News
News
X

Rana Lifestyle: లగ్జరీ బంగళా, ఖరీదైన కార్లు, రానా లైఫ్ స్టైల్ చూస్తే అవాక్కవాల్సిందే!

‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. ఈ నేపథ్యంలో రానా లైఫ్ స్టైల్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం..

FOLLOW US: 
Share:

సినిమా రంగంలో బాగా స్థిరపడిన ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రానా. రామానాయుడు మనవడిగా, సురేష్ బాబు తనయుడిగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ పాపులారిటీ పొందారు. ఆయన లైఫ్ స్టైల్ చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఖరీదైన కార్లు, విలాసవంతంమైన బంగళాలు, తెలివైన పెట్టుబడులతో అదుర్స్ అనిపిస్తున్నారు.  రానా ఖరీదైన ఆస్తులు, లాసవంతమైన జీవనశైలి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. హైదరాబాద్‌లోని విలాసవంతమైన బంగ్లా

రానా దగ్గుబాటి తన భార్య మిహీకా బజాజ్,  అతడి తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌ లో విశాలమైన,  చక్కగా డిజైన్ చేయబడిన ఇంటిలో నివసిస్తున్నారు. ఫిల్మ్ నగర్‌లో ఉన్న అత్యంత భారీ తెల్లని బంగళాలో వీరు ఉంటున్నారు. ఈ ఇల్లు ఒక రిలాక్స్డ్ వైబ్‌ని అందించే మట్టి రంగుల పాలెట్‌ను కలిగి ఉంది.  ఈ ఇంటి స్పేస్ ను  డెక్ చేయడానికి సౌకర్యవంతమైన ఫర్నిచర్‌ ను పొందుపరిచారు. ప్రొజెక్టర్ గది నుంచి సినిమా పోస్టర్‌లు, హై-టెక్ గాడ్జెట్‌లతో కూడిన అతడి హోమ్ ఆఫీస్ వరకు చాలా అద్భుతంగా ఉన్నాయి.  రానా ఏషియన్ పెయింట్స్‌ కోసం చేసిన హోమ్ టూర్ లో విలాసవంతమైన ఆయన భవనం గురించి మరిన్ని వివరాలు వెల్లడి అయ్యాయి.   

2. ఫుట్‌బాల్ టీమ్ కో ఓనర్

రానా 2019లో వరుణ్ త్రిపురనేని, విజయ్ మద్దూరితో కలిసి ISL ఫ్రాంచైజీకి సహ యజమాని అయ్యారు. హైదరాబాద్ ఎఫ్‌సిలో భాగమైనందుకు తాను చాలా సంతోషం వ్యక్తం చేశారు. “హైదరాబాద్‌కు గొప్ప క్రీడా వారసత్వం ఉంది. కాబట్టి ఈ జట్టు బాగా పుంజుకునే అవకాశం ఉంది” అని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

3. విలాసవంతమైన కార్లు

రానా గ్యారేజీలో విలాసవంతమైన BMW 7-సిరీస్ నుంచి సుమారు రూ. 70 లక్షల విలువైన జాగ్వార్ XF వరకు ఉన్నాయి. ఆయన దగ్గర చాలా వరకు లగ్జరీ కార్లే కనిస్తాయి. అవన్నీ వాహన ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి.  

4. రెమ్యునరేషన్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు

రానా CEAT Tyres, SmartWater, Ubon సహా పలు ప్రముఖ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఒక్కో బ్రాండ్‌పై దాదాపు రూ.70 - 80 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇక తన సినిమాల విషయానికి వస్తే ఒక్కో సినిమాకు  దాదాపు రూ.4 నుంచి రూ. 5 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన మొత్తం నికర ఆస్తుల విలువ రూ.45 కోట్లుగా కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

5. ప్రొడక్షన్ హౌస్ & ఇతర వ్యాపార పెట్టుబడులు

రానా నటనా రంగంలోకి రాకముందే యానిమేషన్, విఎఫ్ఎక్స్ స్టూడియోని ప్రారంభించాడు. ఫిల్మ్ మేకింగ్ కుటుంబం నుండి వచ్చిన రానా దగ్గుబాటి సినిమాల్లో స్పెషల్ ఎఫెక్ట్స్ పెరగడాన్ని త్వరగా గుర్తించాడు. అందుకే, 2005లో స్పిరిట్ మీడియాను స్థాపించాడు. ఒక ప్రొడక్షన్ హౌస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు, దగ్గుబాటి టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని కూడా నడుపుతున్నాడు. వెంచర్ క్యాపిటల్ సంస్థ ఐకాన్జ్‌లో కూడా వాటాను కలిగి ఉంది.

6. ప్రపంచవ్యాప్త పర్యటనలు   

సినిమాల్లో బిజీగా ఉన్నా, రానా తన కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు. తన భార్య మిహీకా బజాజ్‌తో కలిసి ఫారిన్ టూర్లు వేస్తుంటారు.   

View this post on Instagram
 
A post shared by Miheeka Daggubati (@miheeka)

Read Also: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి కీలక వ్యాఖ్యలు - ఫ్యాన్స్‌కు పండుగే!

Published at : 19 Mar 2023 05:31 PM (IST) Tags: Rana Daggubati Rana Naidu Rana luxurious lifestyle Ranabungalow Rana expensive cars

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

టాప్ స్టోరీస్

TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

TSPSC Issue :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌