Priyadarshi Pulikonda: రానా దగ్గుబాటి, ప్రియదర్శి కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్.. థ్రిల్లు ప్రాప్తిరస్తు అంటూ పోస్టర్ రిలీజ్
Priyadarshi : యంగ్ హీరోల్లో ఒకరు ప్రియదర్శి. తన టాలెంట్ తో ఎంతో మంచి ఆఫర్లు పొందుతున్నాడు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు మరో క్రేజీ కాంబోతో వస్తున్నాడు.
Priyadarshi Pulikonda New Movie Production 9: టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ లలో ఒకరు ప్రియదర్శి. ఎన్నో మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. హీరో గా కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడిక క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. 'బలగం' లాంటి హిట్ సినిమా తర్వాత నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో, అలాగే జాన్వీ నారంగ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. రానా దగ్గుబాటి సమర్పణలో ఈ సినిమా రాబోతుంది.
'ప్రొడక్షన్ 9..'
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, రాణా దగ్గుబాటి సమర్పణలో సినిమా రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. 'ప్రొడక్షన్ 9' పేరుతో ఒక పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'థ్రిల్లు ప్రాప్తిరస్తూ' అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు కింద. అయితే, సినిమాకి సంబంధించి టైటిల్ మాత్రం ఇంకా ప్రకటించలేదు మేకర్స్. "కావాల్సిన వాళ్లకి కావల్సినంత రొమాన్స్, ఎంటర్ టైన్మెంట్ లాట్ ఆఫ్ థ్రిల్స్ గ్యారెంటీడ్ అమ్మ" అంటూ పోస్ట్ పెట్టారు. ఇదే పోస్ట్ ని రానా దగ్గుబాటి సైతం షేర్ చేశారు. "మీ అందరికీ శీఘ్రమేవ థ్రిల్లు ప్రాప్తిరస్తూ" అని రాసుకొచ్చారు.
ఈ సినిమాలో హీరో ప్రియదర్శి కాగా.. నవనీత్ శ్రీరామ్ దర్శకుడు. జాహ్నవి నారంగ్ ప్రొడ్యూసర్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, రాణా దగ్గుబాటి సమర్పణలో వస్తోంది ఈ సినిమా. అయితే, హీరోయిన్ ఎవరు లాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం తెలియలేదు. సినిమాని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మాత్రం టాక్ వినిపిస్తోంది.
'డార్లింగ్' గా ప్రియదర్శి..
ప్రియదర్శి ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. 'డార్లింగ్' అనే సినిమా చేస్తున్నారు. నబ్బా నటాషాతో కలిసి నటిస్తున్నారు ఆయన. దీనికి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ని కూడా ఈ మధ్యే రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రియదర్శి, నబ్బా భార్యభర్తలుగా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ అశ్విన్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు. 'హనుమాన్' మూవీ ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్నారు.
తక్కువ టైంలో..
ప్రియదర్శి చాలా తక్కువ టైంలో మంచి మంచి కథలు ఎంచుకుని ఇండస్ట్రీలో బాగా క్లిక్ అయ్యాడు. కమెడియన్ గా చేస్తూనే ఎన్నో మంచి మంచి పాత్రలు చేశాడు. 'మల్లేశం' సినిమాలో ఆయన యాక్టింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ తర్వాత ప్రియదర్శి చేసిన వెబ్ సిరీస్ లు, సినిమాలు హిట్ అయ్యాయి. ఈ మధ్య వచ్చిన 'బలగం' సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల రిలీజైన 'ఓం భూం బుష్' లో కూడా సాలిడ్ పాత్ర పోషించాడు ప్రియదర్శి. ప్రియదర్శి నటించిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ మధ్యే దాని కొనసాగింపుగా.. 'సేవ్ ది టైగర్స్' కూడా రిలీజ్ అయ్యింది. ఆ సిరిస్ లో ప్రియదర్శి, సుజాత కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది. వాళ్ల యాక్టింగ్ కి ప్రత్యేక గుర్తింపు లభించింది.
Also Read: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఎన్టీఆర్ను ఇమిటేట్ చేశారా అంటూ ప్రశ్న.. విశ్వక్ సమాధానం ఏమిటంటే..