అన్వేషించండి
The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్
రామ్ పోతినేని నటిస్తోన్న 'ది వారియర్' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
![The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్ Ram Pothineni's The warriorr Movie Trailer released The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/193981668ca4dc2b2c140eb29788dc06_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్
యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది వారియర్'. లింగు స్వామి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలను, టీజర్ ను రిలీజ్ చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను వదిలారు.
మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఈ టీజర్ ను కట్ చేశారు. టీజర్ తోనే అంచనాలను పెంచేశారనుకుంటే ట్రైలర్ వాటిని డబులు చేశారు. రామ్ యాక్షన్, డైలాగ్ డెలివెరీ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక డైలాగ్స్ అయితే మాములుగా లేవు. 'ఒక చెట్టు మీద నలభై పావురాలు ఉన్నాయి.. అందులో ఒక్క పావురాన్ని కాలిస్తే ఎన్ని ఉంటాయి.. అన్నీ ఎగిరిపోతాయి' అంటూ రామ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ నింపేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది.
ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆది పినిశెట్టి విలన్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో రామ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని టాక్. ఒకటి పోలీస్ ఆఫీసర్ కాగా.. మరొక గెటప్ ను సస్పెన్స్ గా ఉంచారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion