By: ABP Desam | Updated at : 25 Mar 2023 11:00 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@RGVzoomin/MM Keeravani/ twitter
టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కీరవాణి, తాజాగా ‘RRR’ సినిమాకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో రిలిసిస్ట్ చంద్రబోస్ తో కలిసి, కీరవాణి ఈ అవార్డును పొందారు. ప్రస్తుతం ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆస్కార్ వేడుక తర్వాత భారత్ కు తిరిగి వచ్చిన కీరవాణి, పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రీసెంట్ గా పొందిన ఆస్కార్ తొలి ఆస్కార్ కాదని, గతంలో ఎప్పుడో తనకు ఆస్కార్ దక్కిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆర్జీవీ నా తొలి ఆస్కార్ అవార్డు- కీరవాణి
ప్రముఖ దర్శకుడు రాజమౌళిని ఉద్దేశించి కీరవాణి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘క్షణ క్షణం’ సినిమాతో కీరవాణికి మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి ఆయన మూడు సినిమాలకు సంగీతం అందించిన పెద్దగా గుర్తింపు రాలేదు. నాలుగో సినిమా ‘క్షణ క్షణం’ చేసి మంచి హిట్ అందుకున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆయన ఇదే విషయం గురించి ప్రస్తావించారు. “రామ్ గోపాల్ వర్మ తన ఫస్ట్ ఆస్కార్ అవార్డు” అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. తాజాగా “‘RRR’ సినిమాకు వచ్చిన ఆస్కార్ తనకు సెకండ్ ఆస్కార్” అని చెప్పుకొచ్చారు.
వర్మ కారణంగానే ఆస్కార్ వచ్చింది- కీరవాణి
అప్పట్లో తాను సినిమా అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించినట్లు కీరవాణి వెల్లడించారు. తన ట్యూన్స్ కు సంబంధించిన క్యాసెట్లు సుమారు 50 మందికి ఇచ్చినట్లు చెప్పారు. వాటిని కొందరు చెత్తబుట్టలో కూడా పడేసి ఉండవచ్చు అన్నారు. కొందరికి నచ్చినా అవకాశాలు ఇవ్వలేదని చెప్పారు. కానీ, రామ్ గోపాల్ వర్మ తన ట్యూన్స్ విని ‘క్షణ క్షణం’ లో అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. అప్పుడు తను ‘శివ’ రామ్ గోపాల్ వర్మగా పేరు పొందారని, ఆయనకు ‘శివ’ అనేది ఆస్కార్ అని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ నాకు(కీరవాణికి) ఆస్కార్ అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ కారణంగానే తనకు సినిమా అవకాశాలు వచ్చాయన్నారు. ఈ రోజు ఆస్కార్ వచ్చిందంటే దానికి కారణం వర్మ అంటూ కీరవాణి పొగడ్తల వర్షం కురిపించారు.
కీరవాణి, చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ
అటు కీరవాణి పొగడ్తలపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. కీరవాణి తన గురించి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “కీరవాణి, నేను చనిపోయినట్లు ఫీలవుతున్నాను. ఎందుకంటే, చనిపోయిన వారినే ఇలా పొగుడుతారు” అంటూ క్యాప్షన్ పెట్టారు. దానికి ఏడుపుగొట్టు ఎమోజీలు యాడ్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. వర్మ ఎంతో మందికి మంచి గుర్తింపు ఇచ్చారని కామెంట్స్ పెడుతున్నారు. తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన వర్మను కీరవాణి ఇప్పటికీ గుర్తుంచుకోవడం ఆయన మంచి మనసుకు నిదర్శనం అని పొడుగుతున్నారు.
Hey @mmkeeravaani I am feeling dead because only dead people are praised like this 😢😩😫 pic.twitter.com/u8c9X8kKQk
— Ram Gopal Varma (@RGVzoomin) March 25, 2023
Read Also: రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్
భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!
NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?
Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!
Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?
KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట
TSPSC: నేడే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే
Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!