Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్
నటిగా వెండితెరపై సందడి చేసిన రష్మి గౌతమ్, ‘జబర్దస్త్’ కామెడీషో యాంకర్ గా మారి మరింత పాపులారిటీ సంపాదించింది. తాజాగా తన రోజు వారి లైఫ్ స్టైల్ ను వివరిస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.
తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మి చేసే సందడి మామూలుగా ఉండదు. ‘జబర్దస్త్‘ కామెడీ షో ద్వారా యాంకరింగ్ లోకి అడుగు పెట్టి, తన అందచందాలు, అలరించే మాటలతో టాప్ యాంకర్ గా ఎదిగింది. ఓవైపు టీవీ రంగంలో రాణిస్తూనే, సినిమాల్లోనూ మెరుస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై దర్శనం ఇస్తోంది. కొద్ది రోజుల క్రితం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తోంది.
ఒక్క వీడియోలో రష్మి రోజు వారీ లైఫ్ స్టైల్
తాజాగా రష్మి తన రోజు వారీ లైఫ్ స్టైల్ గురించి ఓ వీడియోను నెట్టింట్లోకి వదిలింది. అయితే, ఇంటి విషయాలు కాకుండా, కేవలం తన ప్రొఫెషన్ కు సంబంధించిన విషయాలను మాత్రమే ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేసింది. తన మేకప్ దగ్గర నుంచి మొదలు కొని, షోలు, ఈవెంట్లు, ఫోటో షూట్ల వరకు అన్ని విషయాలను ఇందులో వివరించింది. ఇంటి నుంచి మేకప్ స్టూడియోకు చేరుకున్న రష్మి, అక్కడ తన ముఖానికి మేకప్ వేసుకోవడంతో పాటు హెయిర్ సెట్టింగ్, కాస్టూమ్స్ ధరిస్తుంది. ఆ తర్వాత ఈవెంట్ దగ్గరికి బయల్దేరుతుంది. అక్కడ కార్యక్రమంలో పాల్గొని అందరినీ అలరిస్తుంది. అటు నుంచి మళ్లీ మేకప్ స్టూడియో దగ్గరికి వస్తుంది. అక్కడ ఓ ఫోటో షూట్ లో పాల్గొని డేను కంప్లీట్ చేస్తుంది. ఆ తర్వాత తన వ్యక్తిగత సిబ్బందిని పరిచయం చేస్తుంది. వారు రష్మితో తమకున్న అనుబంధాన్ని వివరిస్తారు. అంతేకాదు, తనకు ఎల్లవేళలలా తోడుంటున్న వాళ్లందరికీ రష్మి ధన్యవాదలు చెప్పడంతో వీడియో కంప్లీట్ అవుతుంది.
చలాకీగా కనిపించే రష్మి వెనుక ఇంత శ్రమ ఉందా?
బుల్లితెరపై చలాకీగా కనిపించే రష్మి వెనుక ఇంత మంది శ్రమ, ఇంత కష్టం ఉందా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రేక్షకులను అలరించేందుకు తాను మాత్రం ఎంతో తలనొప్పిని భరిస్తుంది పాపం అని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా యాంకర్ రోజు వారీ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి అనుకుంటున్న అభిమానులకు ఈ వీడియోతో కోరిక తీర్చింది అని చెప్పుకోవచ్చు. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ తను చాలా ప్రశాంతంగా కనిపించడం పట్ల షాక్ అవుతున్నారు. రష్మి ఇలాగే మరిన్ని షోలో చేయాలని, అందరినీ అలరించాలని కోరుకుంటున్నారు. ఏదో ఒకరోజు సినిమా పరిశ్రమలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రష్మి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
రీసెంట్ గా నందుతో కలిసి ‘బొమ్మ బ్లాక్ బస్టర్‘ సినిమా చేసిన తర్వాత, రష్మి మరే సినిమాలో నటించడం లేదు. మంచి కథకోసం సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: నల్లంచు చీరెదాన, నకిలీసు పెట్టేదానా - విష్ణుప్రియ, మానస్ మళ్లీ దుమ్మురేపారుగా