News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

RGV-Kalki 2898 AD: ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీలో ఆర్జీవీ- షూటింగ్ కంప్లీట్ అయినట్లేనా?

ప్రభాస్ తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అతిథి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

FOLLOW US: 
Share:

ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా‘కల్కి 2898 ఏడీ’.  ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ వీడియోస్, గ్లింప్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

‘కల్కి 2898 ఏడీ’లో  ఆర్జీవీ అతిథి పాత్ర

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అతిథిపాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది.‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చాలా కాలంగా టాక్ నడుస్తోంది. తాజాగా ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ చిత్రంలో ఆయన క్యారెక్టర్ ఏంటి? అనేది మాత్రం బయటకు తెలియలేదు. చిన్న పాత్ర అయినా, చాలా ఇంపార్టెన్సీ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రంలో దర్శధీరుడు రాజమౌళి కూడా కనిపించబోతున్నారు. ఈ మూవీలో ఆయన అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. సినిమాలో నటించడంతో పాటు దర్శక విభాగానికి కూడా ఆయన కీలక సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాజా ఊహాగానాల నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెరిగిపోయాయి.     

‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై భారీగా అంచనాలు

‘కల్కి 2898 ఏడీ’లో ఇప్పటికే పలువురు దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు ఇందుకోసం ఆయన భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. మరో బాలీవుడ్ తార  దిశా పటానీ  కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి ముఖ్య  పాత్రలు పోషిస్తున్నారు. వీరికి కూడా నిర్మాతలు భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా రాజమౌళికి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని తెలియడంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీ దత్  నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది. ఇటీవల విడుదల చేసిన దీని గ్లింప్స్‌ వీడియో అభిమానులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

View this post on Instagram
 
A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

Read Also: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఆడియన్స్ రివ్యూ - అనుష్క కమ్‌బ్యాక్ హిట్టు, హీరోకి హ్యాట్రిక్కు!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 07 Sep 2023 09:51 AM (IST) Tags: Nag Ashwin Ram Gopal Varma RGV Kalki 2898 AD RGV Shooting

ఇవి కూడా చూడండి

Vijay Devarakonda : రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా - డైరెక్టర్ ఎవరంటే?

Vijay Devarakonda : రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా - డైరెక్టర్ ఎవరంటే?

Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?

Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

Shruti Haasan : అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న 'ది ఐ', సంతోషంలో శృతి హాసన్

Shruti Haasan : అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న 'ది ఐ', సంతోషంలో శృతి హాసన్

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్

టాప్ స్టోరీస్

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?