అన్వేషించండి

Ram Charan Dhoom 4: షారుఖ్ తో రామ్ చరణ్ ‘ధూమ్ 4‘ - బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే!

Ram Charan Dhoom 4: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ తో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. పాపులర్‌ ఫ్రాంఛైజీ `ధూమ్‌ 4`లో కలిసి నటించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

Ram Charan in Dhoom 4: ‘RRR’ మూవీ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఆ మూవీ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించారు.  ప్రస్తుతం దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్ నడుస్తోంది. షూటింగ్ ఎప్పుడో మొదలైనా చాలా స్లోగా ముందుకు సాగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది. రీసెంట్ గా ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.

‘ధూమ్ 4’లో రామ్ చరణ్!

తాజాగా రామ్ చరణ్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లోబల్ స్టార్ మరోసారి బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ‘తుఫాన్’తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన చెర్రీ, డిజాస్టర్ ను చవి చూశారు. ఈ సినిమా తర్వాత మళ్లీ అటువైపు చూడలేదు. రీసెంట్ గా సల్మాన్ మూవీలోని ఓ పాటలో కనిపించాడు. ఆ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ, ఇప్పుడు పాపులర్ ఫ్రాంచైజీ ‘ధూమ్ 4’లో నటించబోతున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.

అభిషేక్ ప్లేస్ లో రామ్ చరణ్?

2013లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న`ధూమ్‌ 3` మూవీకి సీక్వెల్ గా ‘ధూమ్ 4’ తెరకెక్కించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికే ‘ధూమ్’ ఫ్రాంఛైజీలో మూడు సినిమాలను నిర్మించింది. అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరోలు జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ నటించారు. ఈ మూడు సినిమాల్లో పోలీస్ అధికారిగా అభిషేక్ బచ్చన్ కనిపించారు. ‘ధూమ్ 4’లో మాత్రం అభిషేక్ స్థానంలో రామ్ చరణ్ ను తీసుకోవాలని నిర్మాణ సంస్థ భావిస్తోందట. సౌత్‌లో ఆయనకు ఉన్న క్రేజ్ ను వాడుకోవాలనుకుంటోందట. ఇప్పటికే చెర్రీతో ఈ మూవీ గురించి చర్చలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ‘దూమ్ 3’ని తెరకెక్కించిన విజయ్‌ కృష్ణ ఆచార్య ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.  

‘ధూమ్ 4’ కోసం షారుఖ్ ను సంప్రదించలేదా?

వాస్తవానికి గత కొంతకాలంగా సౌత్ హీరోలు నార్త్ సినిమాల్లో, నార్త్ హీరోలు సౌత్ సినిమాల్లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో షారుఖ్, రామ్ చరణ్ కలిసి యాక్షన్ సినిమాలో నటిస్తే ప్రేక్షకులకు మరింత వినోదాన్ని కలిగించే అవకాశం ఉంది. మరోవైపు ఈ సినిమా కోసం మేకర్స్ షారుఖ్ ను సంప్రదించలేదనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read Also: అసలే నెగెటివిటీ, ఇప్పుడో బూతు పాట - ఇప్పుడు చీప్‌గా అనిపించడం లేదా త్రివిక్రమ్? అప్పటి కామెంట్స్ మరిచారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget