Rakul Preet Singh and Jackky Bhagnani : స్పెషల్ వెడ్డింగ్ వీడియో షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్, మీరూ చూసేయండి
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహం బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఇప్పుడు వాళ్ల పెళ్లికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో షేర్ చేసింది ఈ జంట. మీరు చూసేయండి మరి ఆ వీడియో.
Rakul Preet Singh and Jackky Bhagnani Special Video: నటి రకుల్ ప్రీత్ సింగ్, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. గోవాలో వీళ్ల వివాహం ఘనంగా జరిగింది. దానికి సంబంధించి ఫొటోలు, వీడియోలను రకుల్ ఇలా షేర్ చేయగానే.. అలా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆ జంట అభిమానుల కోసం మరో వీడియో షేర్ చేసింది. గోవాలో జరిగిన పెళ్లి వేడుకలు, పెళ్లికి సంబంధించి స్పెషల్ గ్లింప్స్ ని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు రకుల్, జాకీ భగ్నానీ.
నువ్వు, నేను కాదు.. మనం..
నువ్వు, నేను కాదు.. ఇక నుంచి మనం. అంటూ వీడియో షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. దాంట్లో హల్దీ, సంగీత్, మెహందీ, పెళ్లికి సంబంధించి స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి. వాటిని చాలా చక్కగా క్యాప్చర్ చేశారు ఈ వీడియోలో. జాకీ భగ్నానీ కోసం రకుల్ ప్రీత్ సింగ్ తన సోదరులతో కలిసి నడుస్తూ వస్తున్న మూమెంట్ భలే ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు. ఇక ఈ వీడియోకి ‘బిన్ తెరీ’ పాటను యాడ్ చేశారు. ఆ పాటకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే? రకుల్ ప్రీత్ సింగ్ కోసం జాకీ భగ్నానీ ఆ పాటను స్వయంగా రాసి, కంపోజ్ చేశారు.
View this post on Instagram
దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రుకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వెడ్డింగ్‌కు బాలీవుడ్ స్టార్స్ అంతా గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. అనన్య పాండే, భూమి పెడ్నేకర్, ఆదిత్య రావ్ కపూర్, వరుణ్ ధావన్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్ర, ఆయుష్మాన్ ఖురానా, షాహిద్ కపూర్, మిరా రాజ్ పుత్ తదితరులు వివాహానికి హాజరయ్యారు.
రుకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ మూడేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 2021 అక్టోబర్‌లో బర్త్‌డే సందర్బంగా రకుల్ తన సోల్‌మేట్‌ను వెతుక్కున్నానంటూ జాకీ భగ్నానీని పరిచయం చేసింది. అప్పుడే తన ప్రేమను ఆఫీషియల్ కూడా చేసింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఇక ఆ తర్వాత ఈ నెల 21న ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. గోవాలో జరిగిన వీరి గ్రాండ్ వెడ్డింగ్‌కి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ పెళ్లిలో చక్కటి పింక్ లెహంగాలో మెరిసిపోయారు రకుల్ ప్రీత్ సింగ్. సిల్వర్ షేర్వాణీలో అందంగా కనిపించారు జాకీ భగ్నానీ. ఇక ఈ జంట ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ జంట గోవా నుంచి ముంబై చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ కొత్త జంటకి సోషల్ మీడియా ద్వారా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఎంతోమంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు వీరికి విషెస్ చెప్తూ పోస్ట్ లు పెడుతున్నారు. మంచు లక్ష్మీ, ఉపాసన కొణిదెల తదితరులు రకుల్ జంటని విష్ చేశారు. ప్రధాని మోడీ సైతం ఈ కొత్త జంటకి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్తూ స్పెషల్ నోట్ షేర్ చేశారు. నిజానికి ఈ జంట విదేశాల్లో వివాహం చేసుకోవాలి అనుకుందట. కానీ, మోడీ పిలుపు మేరకే వీళ్లు గోవాకు వెడ్డింగ్ డెస్టినేషన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: కొత్త జంట రకుల్-జాకీ భగ్నానీకి ప్రధాని స్పెషల్ విషెష్ - మోదీ లేఖ వైరల్