
నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!
నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా ‘అన్నీ మంచి శకనములే’ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ తాజాగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ఈ మూవీకు నందినీ రెడ్డి దర్శకత్వం వహించగా మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఈ మధ్యనే ఈ మూవీ షూటింగ్ పనులు పూర్తి చేసుకొని ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంటోంది. రీసెంట్ గా విడుదల చేసిన టీజుర్ కు కూడా మంచి స్పందన వస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ గురించిన విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. నటుడు నరేష్ పై ఫన్నీ కామెంట్లు చేశారు. దీంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ సరాదాగానే కామెంట్లు చేసినా ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టాలీవుడ్ లో రాజేంద్ర ప్రసాద్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కామెడీ, ఫ్యామిలీ, డ్రామా, సీరియస్, సెంటిమెంట్ ఇలా పాత్ర ఏదైనా నటన అదరగొడతారు. అందుకే ఇప్పటికీ ఆయనకు ఆ క్రేజ్ తగ్గలేదు. వరుసగా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన ‘అన్నీ మంచి శకనములే’ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా రెండు కుటుంబాల మధ్య సాగే కథ అని అన్నారు. ఇక నటుడు నరేష్ గురించి మాట్లాడుతూ.. కథకు తమ ఇద్దరి పాత్రలు అవసరం అని, నరేష్ తనకు తమ్ముడు లాంటి వారని, ఆయనతో కలసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. నరేష్ గురించి జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా రిప్లై ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్. నరేష్ కత్తి లాంటి వాడని, అది అందరికీ తెలుసని చళోక్తులు విసిరారు. ఎప్పుడూ పెళ్లి కొడుకులా ఉంటాడని, నిత్య పెళ్లి కొడుకు నరేష్ అంటూ ఫన్నీ గా పంచ్ లు వేశారు. దీంతో అక్కడ అంతా నవ్వులు పూచాయి.
కాగా, నరేష్, నటి పవిత్ర లోకేష్ వ్యవహారం టాలీవుడ్ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నట్టు నరేష్ ఓ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అయితే అది నిజం కాదని, ఆ వీడియో సినిమాలోని ఓ సన్నివేశమనే వాదనలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని నరేష్ ఫుల్ పబ్లిసిటీ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇక ‘అన్నీ మంచి శకనములే’ సినిమాలో నరేష్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్ లో నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీను మే 18 న విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో అయినా సంతోష్ శోభన్ కు మంచి హిట్ అందుతుందేమో చూడాలి.
Also Read : 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ : నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల సినిమా ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

