అన్వేషించండి

జపాన్‌లోనూ RRR హవా - అక్కడి రికార్డులనూ బద్దలకొట్టిన ఫస్ట్ డే కలక్షన్స్!

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా జాపాన్ లో రికార్డులు బద్దలు కొట్టింది. సినిమా విడుదల చేసిన తొలి రోజే రూ. 1 కోటి వసూలు చేసి ఔరా ! అనిపించింది.

ర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా జపాన్ లోనూ రికార్డులు బద్దలు కొడుతోంది. సినిమా విడుదల చేసిన తొలి రోజే రూ.1 కోటి వసూలు చేసి ఔరా ! అనిపించింది. అంతకుముందు జపాన్ లో విడుదలై, తొలి రోజు అధిక వసూళ్లను సాధించిన ప్రభాస్ 'సాహో' ను ఆర్.ఆర్.ఆర్ బీట్ చేసింది. జపాన్ లో సాహో తొలి రోజు 90 లక్షలు వసూలు చేయగా, ఆర్.ఆర్.ఆర్ కోటి రూపాయలు వసూలు చేసి టాప్ రికార్డు సృష్టించింది. ఆర్.ఆర్.ఆర్ జపాన్‌లో అక్టోబర్ 21 న చాలా అంచనాలతో విడుదలైంది. అనుకున్నట్టుగానే మొదటి రోజునే ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. సినిమాకు మంచి స్పందన రావడం, పాజిటివ్ టాక్ తో సినిమా ఈ వారాంతంలో 3.5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ఓ జపాన్ వెబ్ సైట్ లో రాశారు. 

రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ మూవీ కోసం జపాన్ లో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. అక్కడి ఫ్యాన్స్ తో కలసి మాట్లాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాహుబలి లాంటి సినిమాలు అక్కడ మంచి టాక్ ను సంపాదించుకున్నాయి. దీంతో ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు చేస్తున్నారు చిత్ర బృందం. జపాన్ లో రజనీకాంత్ లాంటి హీరోల తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. అందుకే ప్రమోషన్స్ సమయంలో ఎన్టీఆర్ ను కలవడానికి వచ్చిన ఫ్యాన్స్ కొంతమంది భావోద్వేగానికి గురయ్యారు. ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఎన్టీఆర్ జపాన్ ఎప్పుడూ వెళ్లకపోయినా ఆయన సినిమాలు జపాన్ లో మంచి టాక్ తెచ్చుకోడంతో ఆయనకు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇటీవల జపాన్ లో ప్రమోషన్ కార్యక్రమంలో ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ జపనీస్ భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వీరంతా సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు.

రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసిన నటించిన ఆర్.ఆర్.ఆర్ పై మొదట్నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్, రాం చరణ్ తో అంతకముందు రాజమౌళి తీసిన సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది మార్చి లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డుల మోత మోగించింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం ఇలా భాషతో సంబంధం లేకుండా హిట్ టాక్ ను సొంతం చేసుకొని ఇండియన్ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను ఓటీటీలలో ప్రదర్శిస్తున్నారు. సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావడంతో ఇప్పుడు జపాన్ లో కూడా సినిమాను విడుదల చేసారు. అక్కడ కూడా తొలిరోజే రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.

Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

టాప్ హెడ్ లైన్స్

Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Podarillu Serial Today August 18th:పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
పొదరిల్లు: పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
Brahmamudi Serial Today August 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషును రెచ్చగొట్టిన రేఖ – ఇందుతో చలపతి ఎమోషన్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషును రెచ్చగొట్టిన రేఖ – ఇందుతో చలపతి ఎమోషన్‌

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget