అన్వేషించండి
Advertisement
Rajamouli: మహేష్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ - రాజమౌళి ప్లాన్ ఇదే!
మహేష్ బాబుతో బాలీవుడ్ ముద్దుగుమ్మ రొమాన్స్ చేయబోతోందని తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ సినిమా (SSMB29 Movie) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. అది పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతారు.
'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా మహేష్ దే. ప్రస్తుతం రాజమౌళి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అలానే సినిమాలో నటీనటులను కూడా ఫైనల్ చేసుకుంటున్నారు. ముందుగా హీరోయిన్ ను ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. ఈసారి మహేష్ బాబుతో బాలీవుడ్ ముద్దుగుమ్మ రొమాన్స్ చేయబోతోందని తెలుస్తోంది. రాజమౌళి ఫస్ట్ ఆప్షన్ అయితే దీపికా పదుకోన్.
'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా మహేష్ దే. ప్రస్తుతం రాజమౌళి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అలానే సినిమాలో నటీనటులను కూడా ఫైనల్ చేసుకుంటున్నారు. ముందుగా హీరోయిన్ ను ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. ఈసారి మహేష్ బాబుతో బాలీవుడ్ ముద్దుగుమ్మ రొమాన్స్ చేయబోతోందని తెలుస్తోంది. రాజమౌళి ఫస్ట్ ఆప్షన్ అయితే దీపికా పదుకోన్.
బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. ఈమెని మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు రాజమౌళి. ప్రస్తుతం దీపికా.. 'ప్రాజెక్ట్ K' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆమెని మహేష్ సినిమా కోసం ఆన్ బోర్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. రాజమౌళి సినిమా అంటే దీపికా నో చెప్పే ఛాన్స్ లేదు కాబట్టి మహేష్-దీపికా కాంబినేషన్ దాదాపు ఫైనల్ అయినట్లే.
ఇక మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఏ జానర్ సినిమా రాబోతుంది? ఎటువంటి సినిమా చేస్తారు? అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా దర్శక ధీరుడు చెప్పిన మాటలు వింటే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయం.
మహేష్ బాబుతో తాను తీయబోయే సినిమా యాక్షన్ అడ్వెంచర్ అని రాజమౌళి చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి టొరెంటోలో ఉన్నారు. అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్‌కి రావాల్సిందిగా ఆహ్వానం అందడంతో వెళ్లారు. ''మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ సినిమా చేయబోతున్నా'' అని రాజమౌళి తెలిపారు. . గ్లోబ్ ట్రాటింగ్ అంటే ఏంటంటే.... మంచి యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ అని! ప్రపంచమంతా రిలేట్ అయ్యే కంటెంట్ అందులో ఉంటుందని! పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ రిలేట్ అవ్వొచ్చు అన్నమాట.
ఈ సినిమాను కె.ఎల్. నారాయణ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇటు మహేష్, అటు రాజమౌళికి ఆయన ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు. ఈ సినిమా చేయడం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నరు. ఆయన ఒక్కరే సోలోగా ప్రొడ్యూస్ చేస్తారా? లేదంటే మరొకరితో కలిసి చేస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే... రాజమౌళి సినిమా అంటే ప్రొడ్యూస్ చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. డీవీవీ దానయ్యకు అటువంటి ప్రపోజల్స్ వచ్చినా ఓకే చేయకుండా సోలోగా ప్రొడ్యూస్ చేశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion