Rahul Sipligunj: వెస్ట్రన్ బీట్తో తెలంగాణ ఫోక్ - సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్ సాంగ్!
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అదిరిపోయే ప్రైవేట్ సాంగ్ ను విడుదల చేశారు. వెస్ట్రన్ బీట్కి తెలంగాణ ఫోక్ ను కలిపి దుమ్మురేపారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్ లో నిలిచింది.
రాహుల్ సిప్లిగంజ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా పరిచయం అవసరం లేదు. పాటలతో ఆటలు ఆడటంలో తనకు తానే సాటి. వెస్ట్రన్ బీట్ కి తెలంగాణ ఫోక్స్ మిక్స్ చేసి ఆడియెన్స్ ను అలరించడంలో ముందుంటారు. ఇప్పటికే ‘మంగమ్మ’ లాంటి పలు సాంగ్స్ విడుదల చేయడగా, ప్రేక్షకుల నుంచి ఓ రేంజిలో ప్రశంసలు లభించాయి. దీక్ష పంత్ తో కలిసి చేసిన ‘మంగమ్మ’ అనే ఊరమాస్ సాంగ్ అడియెన్స్ ను అబ్బుర పరిచింది.
మరో ప్రైవేట్ సాంగ్ తో దుమ్మురేపిన రాహుల్
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో రాహుల్ టాప్ సింగర్ గా కొనసాగుతున్నారు. మరోవైపు ఆయనే ఓ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. దీని ద్వారా చక్కటి ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నారు. ఇప్పటికే తన ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా పలు పాటలను విడుదల చేశారు. తాజాగా ‘నీ అయ్యా నా మామ’ అనే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ పాట మొత్తం ఎడారి దేశం దుబాయ్ లోనే షూట్ చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు అద్భుతంగా తెరకెక్కించారు. చూడచక్కని మోడల్స్ తో వెస్ట్రన్ మ్యూజిక్ బీట్ తో ఆహా అనిపించే రూపొందించారు. ఈ పాటను రాహుల్ స్వయంగా పాడటంతో పాటు తనే నటించాడు. వినసొంపుగా ఉండటంతో పాటు అందాల భామల సోకుల విందుతో ఆడియెన్స్ ను బాగా అలరిస్తోంది. సినిమా సాంగ్ కు ఏమాత్రం తీసిపోకుండా ఆకట్టుకుంటోంది.
రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు
ఈ పాటలో రాహుల్ కలిసి జెన్నిఫర్ ఇమ్మాన్యూయేల్ ఆడిపాడింది. తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. రాహుల్ అదిరిపోయే డాన్స్, జెన్నిఫర్ అందాల ఆరబోత పాటకు హైలెట్ గా నిలిచాయి. పూర్తి స్థాయిలో తెలంగాణ మాండలికంలో ఈ పాట కొనసాగించింది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే మూడున్నర లక్షలకు పైగా వ్యూస్ అందుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. తెలంగాణ పాటకు గ్లోబల్ అందాలు అద్దాడు అంటూ రాహుల్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసుకుంటున్నారు. ఈ పాటపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ప్రశంసలు కురిపించారు.
WOWWW check out this latest music video NEE AYYA song of @Rahulsipligunj
— Ram Gopal Varma (@RGVzoomin) November 10, 2023
It’s HIGH ENERGY ELECTRIC 💐💐💐https://t.co/Udaw9g3nbt
నాటు నాటు పాటతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు
ఇక రాహుల్ సిప్లిగంజ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో పాడిన ‘నాటు నాటు’ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ పాటకు ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు దక్కాయి. ఈ పాటతో రాహుల్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. హైదరాబాద్ పాత బస్తీ నుంచి ఆస్కార్ వేదికపైకి వెళ్లి పాట పాడే అరుదైన సొంతం చేసుకున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఆయన రేంజ్ మరింతగా పెరిగింది. బిగ్ బాస్ రియాలిటీ షో విన్నర్ గా గతంలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు.
Read Also: మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్, `గేమ్ ఛేంజర్` సాంగ్ వాయిదా, కారణం ఇదే!