అన్వేషించండి

Game Changer 1st Single : మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్, `గేమ్‌ ఛేంజర్‌` సాంగ్‌ వాయిదా, కారణం ఇదే!

Game Changer 1st Single : రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న తాజాగా `గేమ్‌ ఛేంజర్‌` నుంచి దీపావళి కానుకగా ఓ పాటను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, ఈ సాంగ్ రిలీజ్ వాయిదా వేసింది చిత్రబృందం.

Game Changer Movie Updates :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో పొలిటికల్ కథాంశంతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, మూవీ ప్రారంభమై చాలా కాలం అవుతున్నా పెద్దగా అప్ డేట్స్ రావట్లేదు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. దీపావళి కానుకగా తొలి పాట 'జరగండి'ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఫస్ట్ పాట ఎలా ఉంటుందోనని ఆశగా ఎదురు చూశారు. కానీ, ఇంతలోనే వారి ఆశలపై నీళ్లు చల్లింది చిత్రబృందం. ఈ పాట విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.  

పాట విడుదల వాయిదాకు కారణం ఏంటంటే?

`గేమ్‌ ఛేంజర్‌` పాట వాయిదాకు గల కారణాలను వివరిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కీలక ప్రకటన చేసింది. పలు సంస్థల మధ్య ఆడియో డాక్యుమెంటేషన్ సమస్యల కారణంగానే ‘జరగండి’ పాట విడుదలను వాయిదా వేస్తున్నట్లు  ప్రకటించింది. త్వరలోనే ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపింది.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ అభిమానులు కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదని వివరించింది. ‘గేమ్ ఛేంజర్’ను బెస్ట్ అవుట్ ఫుట్ తో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ బృందం నాన్ స్టాప్ గా పని చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేసింది.

‘జరగండి’ పాటపై భారీగా అంచనాలు

వాస్తవానికి ‘జరగండి’ పాటలో ఉన్న ఇళ్లన్నీ సెట్‌ వేశారట. ఈ ఇళ్ల నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేశారట. ఈ ఇళ్లలో తీసిన పాటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ, చివరకు పాట వాయిదా పడినట్లు ప్రకటన రావడంతో అందరినీలోనూ నిరాశ కలిగింది. అయితే, ఈ పాట విడుదల వాయిదాకు ఇతర కారణాలు కూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్‌ కు ఇంకా చాలా సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ప్రమోట్ చేయడం ఎందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది. ఇదే కాకుండా, ఈ పాటను మరో సింగర్ తో పాడించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత పాడిన సింగర్ వాయిస్ అంతగా బాగాలేదని భావించి వేరే సింగర్ తో పాడించాలి అనుకుంటున్నారట. నిజానికి ఈ పాటపై భారీగా అంచనాలు ఉండటంతో విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకున్నారు. అయితే, తాజాగా రూపొందిన పాట అనుకున్న స్థాయిలో ఆకట్టుకోవడం లేదని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే కాస్త లేట్ అయినా, లేటెస్టుగా తీసుకురావాలని రిలీజ్ వాయిదా వేశారట. అటు ఇప్పటికే లీకైన సాంగ్‌పై ట్రోల్స్ కూడా వచ్చాయి. దీంతో దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారట సంగీత దర్శకుడు థమన్. ఈ పాటను రీ రికార్డ్ చేయాలని భావిస్తున్నారట. మొత్తంగా పాటను కొత్తగా రూపొందించడానికి సమయం పట్టడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది.   

పొలిటిక‌ల్ థ్రిల్లర్​గా ‘గేమ్‌ ఛేంజర్‌’  

‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్నది. ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. తెలుగమ్మాయి అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తున్నారు. డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నాడు.  

Read Also: మాజీ ప్రియుడిని ఇంకా మర్చిపోలేదా? దీపిక షేర్ చేసిన పిక్ వెనుక అసలు కథేంటి?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Vijay Deverakonda : నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget