News
News
X

Puri Jagannadh: ఒక్కోసారి చార్మీ ఏడుస్తుంది, నా భార్య వల్లే కొత్త కథలు: పూరీ జగన్నాథ్

చార్మీ అన్ని విషయాలు తానే చూసుకుంటుంది. తాను ఏడుస్తున్న విషయం కూడా చెప్పదు. కొంపలు అంటుకుంటున్నాయ్ అన్నప్పుడే చెబుతుంది: పూరీ జగన్నాథ్

FOLLOW US: 

చార్మీ.. తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి పేరు సంపాదించారు. తన అందాలతో కుర్రకారుకు కిక్కెక్కించిన ఈ ముద్దుగుమ్మ ఎంత త్వరగా స్టార్ డమ్ అందుకున్నారో.. అంతే త్వరగా వెండి తెరకు దూరమయ్యారు. హీరోయిన్ గా కనిపించకపోయినా.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి సినిమా నిర్మాతగా మారిపోయారు. ఇప్పటికే పలు సినిమాలను నిర్మించిన ఈ హాట్ బ్యూటీ.. తాజాగా పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ను తెరకెక్కించారు. తాజాగా వరంగల్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా పూరీ కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. 

చార్మీ.. నాకు టెన్షన్ లేకుండా చూసుకుంది: ‘‘ఈ సినిమా కోసం చార్మీ ఎంతో కష్టపడుతుంది. ప్రాణం పెట్టి సినిమాను నిర్మిస్తోంది. సినిమా కోసం మగాళ్ల కంటే ఎక్కువ కష్టపడుతుంది. ఏ కష్టం ఉన్నా నాకు చెప్పదు. ఏ విషయం నా దగ్గరికి తీసుకురాదు. కొంపలారే విషయాలు అయితేనే నా వరకు తీసుకొస్తుంది. నాకు ఏ టెన్షన్ లేకుండా అన్నీ చేసి పెడుతుంది. సినిమాకు సంబంధించి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. ఒక్కోసారి ప్రొడక్షన్ లో ఏడుస్తుంది. ఆ ఏడ్వటం కూడా నాకు చెప్పదు. వాస్తవానికి ఏ ప్రొడ్యూసర్ ఏడ్వకుండా సినిమా రిలీజ్ కాదు. ఏదైనా ఉంటే విజయ్ తో చెప్తుంది. ఎందుకంటే.. వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. చార్మీ అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటుంది. పబ్లిసిటీ కూడా తనే ప్లాన్ చేస్తుంది. మొత్తంగా లైగర్ సినిమాను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. తనే ఈ సినిమాలోకి మైక్ టైసన్ ను తీసుకొచ్చింది. ఆమె మూలంగానే మైక్ టైసన్ లాంటి లెజెండ్ తో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. లవ్ యూ అండ్ థ్యాంక్యూ చార్మీ’’ అంటూ ప్రశంసలు కురిపించారు దర్శకుడు పూరి. 

దానికి కారణం నా భార్యే: ఇదే వేదిక మీద నుంచి తన భార్య మీద కూడా పూరి ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ప్రస్తుతం నేను కొత్త కథల అన్వేషణలో ఉన్నానంటే దానికి కారణం నా భార్య. కొత్తగా వచ్చిన డైరెక్టర్లు అద్భుతమైన సినిమాలు తీస్తుంటే.. నువ్వు మాత్రం వెనుకబడుతున్నావ్ అని కోప్పడ్డం మూలంగానే తాను కొత్త కథల వైపు ఫోకస్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలు చూసి నేర్చుకోవాలని చెప్పడంతోనే ఆ సినిమా చూశాను. అందులో విజయ్ నటన ఎంతో బాగుంది. అప్పుడే విజయ్‌తో కలిసి సినిమా చేయాలని భావించా. ఆ తర్వాత విజయ్‌తో కలిసి ‘లైగర్’ సినిమా చేసే అవకాశం వచ్చింది. విజయ్ ఈ సినిమా కోసం చాలా నిజాయితీగా పని చేశాడు. తనకు డబ్బులు ఇస్తే ముందు మీ ఖర్చులు చూసుకోండి’’ అని చెప్పే మంచి మనసున్న నటుడు విజయ్’’ అని అన్నారు.   
 
విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే హీరో, హీరోయిన్లుగా నటించిన  లైగర్ సినిమాను పూరి కనెక్ట్స్‌, ధర్మ పొడక్షన్స్‌ సంస్థలు కలిసి నిర్మించాయి. పూరి జగన్నాథ్‌, ఛార్మి, కరణ్‌ జోహర్‌, అపూర్వ మెహతా ఈ సినిమాకు నిర్మాతలు. ఈ నెల 25న లైగర్ పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ కాబోతుంది. 

View this post on Instagram
 
A post shared by Charmmekaur (@charmmekaur)

Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

Published at : 16 Aug 2022 09:47 AM (IST) Tags: Vijay Devarakonda Puri Jagannadh Charmme Kaur Ananya Pandey Liger pre release event

సంబంధిత కథనాలు

Dasara: 'దసరా' మాసీ లోకల్ స్ట్రీట్ సాంగ్ - నాని ఊరమాస్ స్టెప్స్!

Dasara: 'దసరా' మాసీ లోకల్ స్ట్రీట్ సాంగ్ - నాని ఊరమాస్ స్టెప్స్!

Dil Raju: చరణ్, శంకర్ సినిమా - దిల్ రాజు లెక్క తప్పిందా?

Dil Raju: చరణ్, శంకర్ సినిమా - దిల్ రాజు లెక్క తప్పిందా?

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!

Prabhas: ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నారా?

Prabhas: ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నారా?

Rudrangi Motion Poster: “రుద్రంగి నాది బాంచత్” అంటూ గర్జిస్తున్న జగ్గూ భాయ్!

Rudrangi Motion Poster: “రుద్రంగి నాది బాంచత్” అంటూ గర్జిస్తున్న జగ్గూ భాయ్!

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!

Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!