News
News
వీడియోలు ఆటలు
X

Agent: అఖిల్ ‘ఏజెంట్’ కు నైజాంలో బయ్యర్లు లేరా?

ఇటీవల ‘ఏజెంట్’ మూవీ టీమ్ ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ‘ఏజెంట్’ సినిమా నైజాం కు సంబంధించిన డిస్టిబ్యూషన్ పై ఓ విలేఖరి నిర్మాత అనిల్ సుంకరను ప్రశ్నించారు.

FOLLOW US: 
Share:

Agent: టాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ ఉండి కూడా సరైన హిట్ కోసం ఎదురు చూస్తోన్న హీరోలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అక్కినేని అఖిల్ ముందు వరుసలో ఉంటారు. అక్కినేని నాగార్జున వారుసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు అఖిల్. ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నా ఇప్పటికీ సరైన మాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేకపోతున్నారు. మధ్యలో కొన్ని సినిమాలు పర్వాలేదనిపించినా అవి కమర్షియల్ గా సత్తా చాటాలేకపోయాయి. దీంతో మంచి  కమర్షియల్ హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అఖిల్.  ఆ ప్రయత్నాల నుంచి వచ్చిందే ‘ఏజెంట్’ సినిమా. ఈ సినిమాపై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి సినిమా కోసం తన బాడీను తయారు చేసుకున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీబిజీ గా గడుపుతోంది. అయితే అఖిల్ ‘ఏజెంట్’కు ఇప్పుడు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా రిలీజ్, డిస్టిబ్యూషన్ కు సంబంధించి పుకార్లు మొదలైయ్యాయి. అయితే దీనిపై సినీమా నిర్మాత అనిల్ సుంకర క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల ‘ఏజెంట్’ మూవీ టీమ్ ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ‘ఏజెంట్’ సినిమా నైజాం కు సంబంధించిన డిస్టిబ్యూషన్ పై ఓ విలేఖరి నిర్మాత అనిల్ సుంకరను ప్రశ్నించారు. రిపోర్టర్ ప్రశ్నకు అనిల్ సమాధానం చెప్పుకొచ్చారు. నైజాంలో ‘ఏజెంట్‌’ సినిమా రిలీజ్ పై జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్నారు. అవన్నీ పుకార్లు మాత్రమే అని కొట్టిపారేశారు. ఇప్పటికే నైజాం లో సినిమాను అమ్మేశామని చెప్పారు. రెండు నెలలు క్రితమే ఇది జరిగిందని, అయితే సినిమా అమ్మేసిన తర్వాత ఎవరి ద్వారా రిలీజ్ చేయాలి అనేది బయ్యర్ ల ఇష్టమని చెప్పారు. నైజాం లో ప్రముఖ డిస్టిబ్యూటర్లు ఈ సినిమా గురించి అడుగుతున్నారని అన్నారు. తమకు ఫోన్ చేసి అడిగే వాళ్లకు కూడా ఇదే చెబుతున్నామని, సినిమాను అల్రెడీ అమ్మేశాం కాబట్టి వారినే సంప్రదించాలని తాము చెబుతున్నామని పేర్కొన్నారు. కావాలని ‘ఏజెంట్’ సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 

సినిమా అతి త్వరలో రిలీజ్ అవ్వనుండటంతో మూవీ రిలీజ్ పై ఇలా పుకార్లు రావడం అక్కినేని అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో అంచనాలతో ఎదురు చూస్తున్నారు. అఖిల్ కూడా ఈ మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ సారి ఎలాగైనా ‘ఏజెంట్’ సినిమాతో కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోవాలని చూస్తున్నారు అఖిల్. ఇలాంటి టైమ్ లో మూవీ రిలీజ్ పై పుకార్లు రావడం గమనార్హమే. సినిమా రిలీజ్ అయ్యాక ఈ ప్రభావం అలాగే ఉండే మూవీ టాక్ పై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అందుకే దర్శకనిర్మాతలు ఈ  డిస్టిబ్యూషన్ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 28న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ అవ్వనుంది. 

Read Also: ప్రముఖ గాయకుడు మనోకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసిన రిచ్‌మండ్ గాబ్రియేల్ యూనివర్శిటీ

Published at : 16 Apr 2023 03:41 PM (IST) Tags: Akhil Anil Sunkara Agent Movie Agent release

సంబంధిత కథనాలు

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం