అన్వేషించండి

Priyanka Chopra: 65 ఏళ్ల చరిత్ర ఉన్న చీరలో ప్రియాంక చోప్రా - భర్తతో కలిసి ఆటోలో!

65ఏళ్ల చరిత్రగల సారీని గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ధరించారు.దాంతో పాటు తన భర్తతో కలిసి ఆటోలో ప్రయాణించారు.ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది

Priyanka Chopra : సెలబ్రెటీలు అనగానే గుర్తొచ్చేది ముఖ్యంగా అందం, అభినయం, ఆహార్యం. ఈ మూడింటి సమ్మేళనమే ఒక ఆర్టిస్ట్ జీవితంలో అతి కీలకమైన పాత్రలు పోషిస్తాయి. ఏదైనా అకేషన్ లేదా పార్టీకి వెళ్లినా సెలబ్రెటీల వేషధారణ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. ఎందుకంటే సమాజంలో తామొక మోస్ట్ పాపులప్ పర్సన్ గా వారు భావిస్తారు. అంతేకాదు న్యూ డిజైన్ లతో అందర్నీ ఆకట్టుకోవాలని, స్పెషల్ అట్రాక్షన్ గా నిలవాలని భావిస్తుంటారు. అదే తరహాలో గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రెడీ అయ్యి వెళ్లారు. మామూలుగా కాదు.. ఓ స్పెషల్ థీమ్ తో.. స్పెషాలిటీ ఉన్న వేషధారణతో. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేశారు. ఆ ఆహార్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఇటీవల ముంబైలో ప్రారంభమైన  నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి అనేక మంది సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, వరుణ్ ధావన్ లాంటి చాలా మంది అటెండ్ కావడంతో పాటు తమ టాలెంట్ ను ప్రదర్శించి, ఆకట్టుకున్నారు. అదే ఈవెంట్ కు నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త, నటుడు-గాయకుడు నిక్ జోనాస్‌ వెళ్లారు. మామూలుగా సెలబ్రెటీలు అనగానే కోట్ల విలువ చేసే కార్లలో వస్తూ ఉంటారు. కానీ ఈ జంట మాత్రం ఆటోలో ఈవెంట్ కు హాజరయ్యారు. లాస్ ఏంజిల్స్ నుండి ముంబైకి వెళ్లిన ఈ స్టార్ కపుల్ కాస్త ఆకర్షణీయంగా కనిపించారు. అందులో ముఖ్యంగా ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఈ డ్రెస్ కు సంబంధించిన డిటెయిల్స్ ను వర్ణిస్తూ, తన భర్తతో ఆటోలో నుంచి దిగుతున్న ఫొటోను ప్రియాంక చోప్రా షేర్ చేశారు. 

తన భర్త నిక్ జోనాస్ తో డేట్ నైట్ కు వెళ్లానని, అది కూడా ఆటోలో అని తెలియజేసేలా ఆటో సింబల్ ను ప్రియాంక చోప్రా చేర్చారు. తనకు సహకారాన్ని అందించిన అమీ పటేల్ కు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. తన లాగే తన డ్రెస్సింగ్ తూర్పు, పడమరల సమ్మేళనంగా ఉండాలని పాత కాలపు దుస్తులు ధరిస్తానని తెలిపారు. తనకు ఇంతటి అందమైన హస్తకళా సౌందర్యంతో 65 ఏళ్ల పాతకాలపు బనారసీ పటోలా (బ్రోకేడ్) చీరను తయారు చేసినందుకు అమిత్ అగర్వాల్‌కు ఇన్ స్టా ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఖాదీ పట్టుపై బంగారంతో ఎలక్ట్రోప్లేటింగ్ చేశారన్నారు. దీనిపై అమర్చిన తొమ్మిది రంగుల ఇకత్ నేతను ప్రతిబింబించేలా ఉందంటూ ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. 

బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలతో పాపులారిటీతో పాటు ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా.. 2017లో బేవాచ్‌ మూవీతో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 2018లో తనకంటే చిన్నవాడైన పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2022లో సరోగసి ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత తన భర్త నిక్‌తో కలిసి లాస్ఏంజెల్స్‌లోనే సెటిల్ అయిన ప్రియాంక... రీసెంట్ గా ఇండియాకు వచ్చారు. ఇక ఆమె సినిమా విషయానికొస్తే.. హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ను, అమెజాన్ సంస్థ గ్రాండ్ గా రూపొందిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంలోనే ఏప్రిల్ 28న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget